Posts

Showing posts from 2020

వీకెండ్ స్వాతంత్రం

సముద్రం లో ఉప్పుకి చెట్టు మీద కాయకి లంకె పెట్టిన ఆ దేవుడే తెలుగు వాళ్ళకి అమెరికా కి కూడా లింకు పెట్టేసాడు. ఇప్పుడు మనకి చాలా కామన్ అయిపోయింది కానీ అసలు ఎంత విచిత్రం! ఎక్కడ తెలుగు రాష్ట్రాలు? ఎక్కడ అమెరికా? వేల కిలోమీటర్ల దూరమే కాదు భావజాలాలు, వాతావరణాలు, సంస్కృతుల్లో బోల్డు తేడా. ఏంటో అలా రాసి పెట్టి ఉంది అనుకోవడమే తప్ప లాజిక్ కి అందనిది ఈ పరిణామం! ఇప్పుడు అమెరికా డాలర్, అమెరికా రాజనైతిక, సామజిక పరిస్థితుల్లో ఏ మాత్రం తేడా వచ్చినా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో 'కాల్'కలం మొదలైపోతుంది .. 'అంతా బానే ఉన్నారా?' 'మీ ఏరియా లో ఎలా ఉంది?' 'జాగ్రత్త గా ఉండండి' .... కాల్ కట్ .. వర్రీ మొదలు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇంటికి వెళ్లి సర్వే చేసిన వారి కుటుంబం నుంచో, చుట్టాల నుంచో లేదా కనీసం తెలిసిన వాళ్ళ సర్కిల్ నుంచో ఎవరో ఒకరు అమెరికా లో ఉన్నారని చెప్తారు. అమెరికా లో ఉన్న తెలుగు వారి ముద్ర మెల్లిగా అన్ని రంగాల్లో కనబడుతోంది .. ఇక్కడా .. అక్కడా కూడానూ. అందుకే ఈ రోజు అమెరికా స్వాతంత్ర దినం గురించి పోస్టు రాస్తే పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. అత్తారిల్లు బాగుంటేనే మనమ్మాయి బా

చెత్త టాపిక్

Image
నా బ్లాగ్ క్వాలిటీ ని శంకించకండి.  అక్షరాలా చెత్త టాపిక్ ఇది ..  చెత్త .. వేస్ట్ .. ట్రాష్ .. ఎన్ని మాటలు ఉపయోగించినా వాటిలో వ్యక్తమయ్యేది తీసిపారేసే, ఛీత్కార భావమే .. అదే చేస్తున్నాం కూడా .. మన జీవన శైలి వల్ల ఏ చెత్త ఎంత ఎలా పేరుకుపోయి అది ఎక్కడికి పోతోందో అని ఆలోచించట్లేదు. మన జీవన శైలే ఆలోచించనియ్యదు కూడా. మనం చాలా బిజీ. వేళాకోళంగా అనట్లేదు. నిజంగానే అంటున్నాను. మనకి చదువుకొనే అప్పుడు దీని గురించి అవగాహన కల్పించరు కదా. అది కూడా ఓ కారణం.  హిందీ లో ఓ సామెత ఉంటుంది ... 'జబ్ జాగే వహీ సవేరా' (ఎప్పుడు మేల్కొంటే అప్పుడే తెల్లారినట్టు) అని.  తెలుగు లో కూడా ఈ అర్ధం వచ్చే సామెత ఉండే ఉంటుంది.. ఇప్పుడు గుర్తు రావట్లేదు. (మీరు గుర్తు చేస్తే కృతజ్ఞురాలిని).  అందుకే ఎప్పుడు మనకి తెలిస్తే అప్పుడే ఈ విషయం కొంచెం పట్టించుకోవడం మొదలుపెడితే మంచిదే. గిల్టీ ఫీలవ్వక్కర్లేదు.  నగరం లో ఒక నలుగురు సభ్యులు ఉన్న సగటు కుటుంబం నుంచి ఎంత చెత్త వస్తుందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది మనకి తెలిసిందే.  పాల ప్యాకెట్ల నుంచీ మొదలు. సరుకుల కవర్లు, పేపర్లు, షాంపూ బాటిల్స్, సోప్ బాక్సులు, టీవీ,

పదేళ్ళ క్రితం ఈనాడు ఆదివారం పుస్తకం లో వచ్చిన నా కథ

Image
చిన్నప్పటి నుంచీ ఎంతో ఇష్టంగా చదివే ఈనాడు పుస్తకం లో నా కథ రావడం నా జీవితం లోని ఆనందాల్లో ఒకటి.  ఆ కథ చదివి నన్ను ఆన్లైన్ లో వెతికి మరీ నా ఫేస్ బుక్ కి మంచి కాంప్లిమెంట్స్ పంపించారు కొంత మంది. ఇది బోనస్ ఆనందం.  ఆ కథ ఈ రోజు మీ తో షేర్ చేసుకుంటున్నాను.   రెండో వరస ఆఖరు పేరా లో కొన్ని లైన్లు ప్రింట్ అవ్వలేదు. "గాభరాగా ఫోన్ ఎత్తితే 'లోన్ ఏమన్నా కావాలా అండీ?' అంటూ  వినిపించింది అటు నుంచి. కొంచెం ప్రశాంతత...'  

ప్లేట్లో వేడి వేడి టిఫిన్...

Image
2008....  అప్పుడే పన్నెండేళ్ళు గడిచిపోయాయా? నిట్టూర్చింది సౌమ్య.  తెల్లబడుతున్న తన ముంగురులని వెనక్కి తోసుకుని మళ్ళీ రాయనారంభించింది.  కాలానికి ఏమి? అది అలా వెళ్లిపోతుంటుంది .. అవి మిగిల్చే అనుభవాలతో, జ్ఞాపకాలతో బ్రతకడమే మన పని ... ఏదో ఓ రోజు మనం కూడా కాలం చేస్తాం .. మన తర్వాతి వారికి ఏది మిగిల్చి వెళ్తాము అనేదే  మన చేతిలో ఉన్నది.  ఇంతవరకూ రాసి కలం పక్కన పెట్టి కళ్ళు మూసుకొని వెనక్కి వాలింది. రైటింగ్ టేబుల్ మీద పెట్టిన కాఫీ ఎప్పుడో చల్లారిపోయింది... తన ఆవేశాల్లాగా ...  2008...  అవి నేను బ్లాగ్ లో ఫిక్షన్ అంటే కాల్పనిక సాహిత్యం రాసే రోజులు! కానీ పైన రాసిన లాంటి డ్రమాటిక్ ఫిక్షన్ కాదనుకోండి ... వ్యంగ్యం. (పైన రాసింది కూడా వ్యంగ్యమే అని చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. 😉) ఫిక్షన్ రాయడం నాకు మహా బోర్ .... నేను చెప్పాలనుకున్న విషయానికి ఓ కథ అల్లి, పాత్రల చిత్రణ చేసి, ఓ ప్రపంచం సృష్టించి.... ఆ పాత్రల చేత అనుకున్న మెసేజ్ ని చెప్పీ చెప్పకుండా చెప్పించడం ... అది దానంతట అదే పాఠకుడికి తట్టేలా చెయ్యడం .. అబ్బో .. చాలా డబుల్ పని. దాని బదులు .. ఇది ఇది .. అది అది .. అని సూటిగా చెప్పేస

డూడ్లింగ్ అను పరధ్యాన చిత్రకళ

Image
చిన్నప్పుడు స్కూల్ లో నో, పెద్దయ్యాక ఆఫీసు మీటింగ్స్ లోనో, లేదా ఎవరితోనైనా ఫోన్ లో మాట్లాడుతూనో చేతి లో పెన్ను పేపర్ ఉంటే ఏవో గీతాలు గీసేస్తూ ఉంటాం చూడండి ...  ప్రతి చిన్న పని కి పేరు పెట్టేసే ఇంగ్లీష్ భాష లో దీని పేరు డూడ్లింగ్ ... (doodling). ఆ బొమ్మల్ని డూడుల్స్ (doodles) అంటారు.  పిచ్చి గీతల్లా అనిపించే ఈ డూడుల్స్ కి మనస్తత్వ శాస్త్రానికి, ధ్యానానికి.. ఇలా చాలా లోతైన సంబంధాలున్నాయట .. వాటితో ఈ రోజు మిమ్మల్ని విసిగిస్తానన్నమాట. 😁 ఎప్పుడైనా గమనించండి .. ఇలా గీసే గీతల్లో ఎవరి స్టైల్ వారిది ఉంటుంది .. మా అక్క ఎక్కువగా కళ్ళు వేస్తుంది .... ఇంద్రుడికి ఒళ్ళంతా కళ్ళు అన్నట్టు మా అక్క ఆలోచిస్తుంటే పేజీ అంతా కళ్ళే ఉంటాయి! (దాని అనుమతి లేకుండా రాసేస్తున్నాను ... ఏం జరుగుతుందో ఏవిటో!)  అలాగే కొంత మంది స్టిక్ ఫిగర్స్ .. అంటే ఓ నిలువు గీత .. దాని మీద గుండ్రంగా తల కాయ, ఆ గీత కి అటో రెండు ఇటో రెండు చేతులూ కాళ్ళలాగా గీస్తూ ఉంటారు. మా కజిన్ ఒకమ్మాయి పిచ్చి గీతాలు వెయ్యదు సరికదా ... కళాఖండాలే వేసేస్తూ ఉంటుంది.. ఆ డూడుల్స్ ఏ తాజ్ మహల్ మీదో చెక్కిన చిక్కటి డిజైన్ల లాగా ఉంటాయి .. చిక్కటి అంటే ..

ఈ 'గడ్డ' పై మమకారం

Image
బంగాళా దుంప లేదా ఆలు గడ్డ - ఇది నచ్చని వారిని నేను అనుమానిస్తాను. వీళ్ళు చాలా తేడా మనుషులై ఉంటారు నా అభిప్రాయం లో. కేవలం వాళ్ళకొక ప్రత్యేకత ఏర్పాటు చేసుకోవటం  కోసం 'ఆ .. మాకు ఆలు అంత గా నచ్చదు' అని అనే రకం. లేకపోతే జీవితం లో అసలైన ఆనందం ఇచ్చేవి - వాన, ఇంద్రధనుస్సు, పువ్వులు .. వీటి తో పాటు 'ఆలు' కూడా పడని రకం. లేకపోతే ఈ దుంప ఎంత తినేసారంటే ఇంక వెగటు పుట్టేసిన రకం. ఇది విశ్వామిత్ర సృష్టి అని జడ్జి చేసే రకం. లేదా మనసు లో ఇష్టం ఉన్నా డైటింగ్ పేరుతో దూరం పెడుతున్న రకం. ఏ రకమైనా వీళ్ళ తో స్నేహం చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే.  లేకపోతే ఏవిటండి .. బంగాళా దుంప ఎంత అపురూపమైన సృష్టి! ఇది లేకపోతే మాత్రం ఖచ్చితంగా సృష్టి లో ఏదో లోపం ఉండేది. అయినా దాని గొప్పతనం వర్ణించ నేనెంత!  నేను ఈ మధ్యే ఓ ప్రొమోషన్ సంపాదించాను. వంటింట్లో. వంట లో నెక్స్ట్ స్థాయి కి వెళ్ళాను అని అప్పటి నుంచి తెగ విర్రవీగుతున్నాను.  ఆ ప్రొమోషన్ గురించి చెప్పే ముందు కొంత నేపథ్యం, స్థల పురాణం ... ఇలాంటివి చెప్పుకోవడం చాలా ముఖ్యం.  బంగాళా దుంపల్లో చాలా రకాలున్నాయి. పంట పండించే వాళ్ళకి,

యే కౌన్ చిత్రకార్ హై ...

Image
ఈ బ్లాగ్ పోస్ట్ లో నా పని చాలా సులువు. నా ప్రయత్నం ఎప్పుడూ నా మనసు కి తాకిన అనుభూతులని పంచుకోవడమే. అది మాటల్లో పెట్టడం ఒక బాధ్యత గల పని గానే భావిస్తాను. కానీ ఈ రోజు నేను పంచుకోబోతున్న అనుభూతిని నేను పరిచయం చేస్తే చాలు. వర్ణించక్కర్లేదు. మీకు మీరుగా అనుభూతి చెందే వీలుంది. ఈ ఫోటో లో అమ్మాయి మోడల్ కాదు. యూట్యూబ్ లో ఒక ఛానెల్ నిర్వహిస్తుంది. ఈ ఛానెల్ లో ఒక్కొక్క వీడియో మన ని ఆమె లోకానికి తీస్కెళ్ళిపోతుందంటే నమ్మండి!  ఆమె పేరు యోనా. Jonna Jinton. (వాళ్ళ భాష లో 'జె' అక్షరం 'య' గా పలుకుతారు) స్వీడన్ లో పది గడపలు ఉన్న పల్లెటూరిలో ఉంటుంది. ఈ పల్లె ప్రత్యేకత ఉత్తరధృవానికి దగ్గరగా ఉండటం.  ఇక్కడ భూమి మనకి పరిచయం లేని ఎన్నో రంగులు చూపిస్తుంది .. అక్షరాలా.  ట్రావెలింగ్ ఆసక్తి ఉన్న ఎవరైనా నార్తర్న్ లైట్స్ గురించి వినుంటారు. ఉత్తర ధృవానికి దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో ఆకాశం కొన్ని కాలాల్లో రంగురంగులు గా మెరవటమే నార్తర్న్ లైట్స్ అంటే.  ఇది చూడటానికి ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించి, కొన్ని లక్షలు ఖర్చుపెట్టడానికి కూడా వెనకాడరు ఔత్సాహికులు. అలాంటిది ఆమె ఇల్లు ఆ లైట్

జీవిత పరమావధి

Image
ముందుగా ఓ బొమ్మ చూద్దాం.  Made into Telugu by Sowmya Nittala for sowmyavadam.blogspot.com Feel free to use it. ఎవరైనా వాడుకోవచ్చు ఈ బొమ్మని.  ఆ మధ్య లో ఉన్న పదం 'ఐకగై' IKIGAI అనే జపనీస్ పదం. దీని గురించి మన తెలుగు లోనే మంచి వీడియో చేశారు ఒకళ్ళు. ఇక్కడ చూడండి.  ఈ యూట్యూబ్ ఛానల్ లో చాలా మంచి కంటెంట్ ఉంది ... ముఖ్యంగా స్టూడెంట్స్ కి. ఇది వారి ఛానెల్. Telugugeeks   రెండు విషయాలు ముందే చెప్పాలి.  ఇంగ్లీష్ స్పెల్లింగ్ చూసి ఇకిగై అనకూడదు .. ఐకగై అనేది సరైన ఉచ్చారణ  రెండోది ... ఈ బొమ్మ పూర్తిగా 'ఐకగై' అనే జపాన్ వారి లైఫ్ ఫిలాసఫీ కి సూచిక కాదు. వారి ఫిలాసఫీ ఇంకా లోతుగా, ఇంకా రిలాక్స్ డ్ గా ఉంటుంది.  ఈ బొమ్మ జీవితం లో పర్పస్ వెతుక్కోడానికి ఉపయోగపడేది ... దాన్ని ఐకగై .. (అంటే జపనీస్ భాష లో 'పొద్దున్నే నువ్వు ఎందుకు నిద్ర లేస్తావో ఆ కారణం' .. ఎందుకు జీవిస్తున్నామో ఆ ఉద్దేశం) కి జోడించారన్నమాట.  ఇది ఒక అభిప్రాయం లేదా ఒక థియరీ గా మాత్రమే ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం.  మానవ జీవితానికి ఉద్దేశం ఏంటి? మనం నమ్మే సిద్ధాంతాల బట్టీ దీనికి జవాబు ఉంటుంది. ఏ ప్రయ

ఆనందమే లేదా

ఒక స్క్రిప్ట్ రాసుకుందామని 'ఆనందం' మీద సమాచార సేకరణ మొదలు పెట్టాను ఆ మధ్య. అదింకా కొనసాగుతోంది. దాన్నుంచి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు తెలిసాయి ... అవి ఇక్కడ పంచుకుంటున్నా ఈ రోజు.  ఆనందం అని గూగుల్ లో కొడితే వచ్చిన రిజల్ట్స్ లో నాకు కుతూహలం కలిగించినవి ఇవి .. పంచ విధ ఆనందములు 1. విషయానందము 2. యోగనందము 3. అద్వైతానందము 4. విదేహానందము 5. బ్రహ్మానందము అష్టవిధ ఆనందములు  1. బ్రహ్మానందం 2. వాసనానందం 3. విషయానందం 4. ఆత్మానందం 5. అద్వైతానందం 6. యోగానందం 7. సహజానందం 8. విద్యానందం కానీ వీటి గురించి ఇంకేవిధమైన సమాచారమూ లేదు. ఇవి ఎవరు చెప్పారు .. ఏ పుస్తకం నుంచి గ్రహించారు లాంటి వివరాలు ఏమీ లేవు. పేర్లు చూస్తే కొన్ని అర్ధమయిపోతున్నాయి ... విషయానందము లాంటివి. కానీ రాసిన వారు ఎలా వీటిని డిఫైన్ చేశారో తెలుసుకోవాలని ఉంది. (ఎవరికైనా ఈ వివరాలు తెలిస్తే చెప్తారు కదూ నాకు?) చలం గారు ఆనందం మీద రాసిన వ్యాసం కూడా దొరికింది ఆన్లైన్ లోనే.   ఇక్కడ క్లిక్ చేసి చదువుకోవచ్చు. బెర్ట్రాండ్ రస్సెల్ గారు రాసిన 'కాంక్వెస్ట్ అఫ్ హ్యాపీనెస్' (ఆనందం పై విజయం అనచ్చేమో) కూడా చాలా బాగుంది. దాని గురించి ఇంకెప