2023 నుంచి నేను ....
2022 సంవత్సరం ఇంకో పక్షం రోజుల్లో అయిపోతోంది. కొత్త సంవత్సరం రాబోతోంది. ఈ టైం లో రెండు రకాల వ్యక్తులు కనిపిస్తారు. కాలెండర్ మారడం తప్పించి ఇందులో ఏముంది అని లైట్ తీసుకొనే వారు. రెండో రకం వ్యక్తులు కొత్త సంవత్సరం అంటే ఏదో కొత్త ఉత్సాహం ఫీల్ అవుతారు లేదా ఏదో ఒకటి కొత్తగా చెయ్యాలి ఈ సంవత్సరం అనుకుంటారు ... ఓ హోప్, రానున్న సంవత్సరం పట్ల బోలెడు ఆశలు, ఎలా ఉండబోతోంది అనే కుతూహలం ఉన్న వారు వీరు. సరిగ్గా ఇలాంటి వారే న్యూ ఇయర్ రెసొల్యూషన్స్ .. నూతన సంవత్సరం కోసం కొన్ని తీర్మానాలు తీసుకుంటారు. నేను రెండో టైపు అని చెప్పడం నా కర్తవ్యం గా భావిస్తున్నాను.... ఎవరూ అడగకపోయినా. కాలమహిమ లో మనం చెప్పుకున్నట్టు ఇంగ్లీష్ కాలెండర్ ని ఇష్టం వచ్చేసినట్టు మార్చేసిన చరిత్ర ఉంది. దాని దృష్ట్యా అసలు ఇప్పుడు వచ్చే జనవరి ఒకటి 2023 అసలు ఆ తేదీ ఏ నా అంటే కాదు మరి. రోడ్డు మీద పానీపూరి ఇష్టంగా తింటుంటే "ఇది అసలు ఎలా తయారు చేస్తారు తెలుసా" అని వీడియోలు చూపిస్తే ఏమంటాం? ఒక్కోసారి కఠినమైన ... లేదా ఆ టైం కి అనవసరమైన నిజం కంటే భ్రమే బాగుంటుంది .. అది కూడా ప్రపంచం అంతా మనతో పంచుకొనే భ్రమ అయితే మరీనూ! అసలు ఈ ప్