లిటిల్ విమెన్ (Little Women)
ఈ సంవత్సరం పన్నెండు నెలల్లో పన్నెండు పుస్తకాలు చదవాలని సంకల్పం చేసుకున్నాను. రెండు నెలలు రెండు పుస్తకాలు అయ్యాయి. అందులో ఒక పుస్తకం గురించి ఈ రోజు. పుస్తకం: నవల పేరు: లిటిల్ విమెన్ (Little Women) భాష: ఇంగ్లీష్ రచయిత్రి: లూయీజా మే ఆల్కాట్ (Louisa May Alcott) దేశం: అమెరికా అచ్చయిన సంవత్సరం: 1868 - 1869 ( ఆమె అప్పుడు రెండు భాగాలు గా రాసినది ఇప్పుడు ఒక నవల గా చదువుకుంటున్నాం మనం) ఎప్పటి నుంచో చదవాలి చదవాలి అనుకుంటే ఇన్నేళ్లకి కుదిరింది. వందేళ్లు (ఇంకా ఏవో లెక్కలు ఉన్నాయి లెండి) దాటాక ఓ పుస్తకం పబ్లిక్ డొమెయిన్ లోకి వస్తుందట. (పుస్తకమనే కాదు .. కాపీ రైట్ ఉన్న క్రియేటివ్ వర్క్ ఏదైనా). అంటే మనకి ఫ్రీ గా దొరుకుతుంది. మీరు నవల చదివి ఆ ఆనందాన్ని స్వయంగా అనుభవించాలనుకుంటే ఇంతే చదవండి. ఎందుకంటే ఇంక కథ చెప్పేస్తాను ... అందులో స్పాయిలర్స్ (కథ లో కీలకమైన మలుపులు ముందే చెప్పేయడాన్ని స్పాయిలర్స్ అంటారు కదా) ఉంటాయి. మరి మీ ఇష్టం. మధ్య తరగతి కి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్ళ కథ ఇది. మెగ్, జో, బెత్, ఏమి ... నవల ప్రారంభం లో వీళ్ళ వయసులు 16, 15, 13, 12. పదేళ్ల పాటు వారి జీవితాన్ని ఫాలో చ