అటక - ఒక టైం మెషీన్
కొన్ని రోజుల కిందట అటకెక్కాను. ఏదో craft కి కొన్ని వస్తువులు కావాలి. అవి ఏవైనా దొరుకుతాయేమో అని. ఎలక్షన్ మేనిఫెస్టో లో ఉన్నవి ఎన్నికలు అయిపోయాక మారిపోయినట్లే నేను అసలు ఎందుకు అటకెక్కానో ఆ ఉద్దేశం అటకెక్కించేసి ఓ ఐదారు కార్టన్లు దించుకున్నాను. ఈ కార్టన్ల లో నా బాల్యం, కౌమారం నిక్షిప్తమై ఉన్నాయి. యవ్వనం ఇంకా కార్టన్ల లో కి చేరలేదులెండి. I am not that old. నేను చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు ... మా తాతగారు కొనిచ్చిన బిల్డింగ్ సెట్స్ .. ప్లాస్టిక్ వి. అమ్మ షోకేస్ లో పెట్టే కొన్ని బొమ్మలు రెండు జిరాఫీలు, రెండు జింకలు, రెండు కుందేళ్లు... ఓ కోర్టు రూమ్ సీన్ .. ఒక జడ్జి, ఒక ముద్దాయిలని నిలబెట్టే బోను, ఒక దొంగ.. అతనికి ఇరువైపులా అతన్ని గొలుసులతో పట్టుకున్న పోలీసు కానిస్టేబుళ్లు .. తమాషా ఏంటంటే దొంగ బొమ్మ ఆ మధ్య నుంచి ఊడిపోయింది .. బొమ్మల్లో కూడా దొంగ తప్పించేస్కున్నాడు! మా నాన్న గారు నాకు కొనిచ్చిన మొదటి బొమ్మ .. లియో కంపెనీ వాళ్ళ గూడ్స్ ట్రెయిన్ .. దాని నుంచి 'కీ' ఇస్తే వచ్చే మ్యూజిక్కు. ..ఆ ట్రెయిన్ బొమ్మ నుంచి వచ్చే సంగీతమే sound track of my childhood అండీ. It