ఆనందమే లేదా
ఒక స్క్రిప్ట్ రాసుకుందామని 'ఆనందం' మీద సమాచార సేకరణ మొదలు పెట్టాను ఆ మధ్య. అదింకా కొనసాగుతోంది. దాన్నుంచి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు తెలిసాయి ... అవి ఇక్కడ పంచుకుంటున్నా ఈ రోజు. ఆనందం అని గూగుల్ లో కొడితే వచ్చిన రిజల్ట్స్ లో నాకు కుతూహలం కలిగించినవి ఇవి .. పంచ విధ ఆనందములు 1. విషయానందము 2. యోగనందము 3. అద్వైతానందము 4. విదేహానందము 5. బ్రహ్మానందము అష్టవిధ ఆనందములు 1. బ్రహ్మానందం 2. వాసనానందం 3. విషయానందం 4. ఆత్మానందం 5. అద్వైతానందం 6. యోగానందం 7. సహజానందం 8. విద్యానందం కానీ వీటి గురించి ఇంకేవిధమైన సమాచారమూ లేదు. ఇవి ఎవరు చెప్పారు .. ఏ పుస్తకం నుంచి గ్రహించారు లాంటి వివరాలు ఏమీ లేవు. పేర్లు చూస్తే కొన్ని అర్ధమయిపోతున్నాయి ... విషయానందము లాంటివి. కానీ రాసిన వారు ఎలా వీటిని డిఫైన్ చేశారో తెలుసుకోవాలని ఉంది. (ఎవరికైనా ఈ వివరాలు తెలిస్తే చెప్తారు కదూ నాకు?) చలం గారు ఆనందం మీద రాసిన వ్యాసం కూడా దొరికింది ఆన్లైన్ లోనే. ఇక్కడ క్లిక్ చేసి చదువుకోవచ్చు. బెర్ట్రాండ్ రస్సెల్ గారు రాసిన 'కాంక్వెస్ట్ అఫ్ హ్యాపీనెస్' (ఆనందం పై విజయం అనచ్చేమో) కూడా చాలా బాగుంది. దాని గురించి ఇంకెప