పోస్ట్‌లు

వీకెండ్ స్వాతంత్రం

సముద్రం లో ఉప్పుకి చెట్టు మీద కాయకి లంకె పెట్టిన ఆ దేవుడే తెలుగు వాళ్ళకి అమెరికా కి కూడా లింకు పెట్టేసాడు.

ఇప్పుడు మనకి చాలా కామన్ అయిపోయింది కానీ అసలు ఎంత విచిత్రం!

ఎక్కడ తెలుగు రాష్ట్రాలు? ఎక్కడ అమెరికా? వేల కిలోమీటర్ల దూరమే కాదు భావజాలాలు, వాతావరణాలు, సంస్కృతుల్లో బోల్డు తేడా. ఏంటో అలా రాసి పెట్టి ఉంది అనుకోవడమే తప్ప లాజిక్ కి అందనిది ఈ పరిణామం!

ఇప్పుడు అమెరికా డాలర్, అమెరికా రాజనైతిక, సామజిక పరిస్థితుల్లో ఏ మాత్రం తేడా వచ్చినా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో 'కాల్'కలం మొదలైపోతుంది .. 'అంతా బానే ఉన్నారా?' 'మీ ఏరియా లో ఎలా ఉంది?' 'జాగ్రత్త గా ఉండండి' .... కాల్ కట్ .. వర్రీ మొదలు.

తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇంటికి వెళ్లి సర్వే చేసిన వారి కుటుంబం నుంచో, చుట్టాల నుంచో లేదా కనీసం తెలిసిన వాళ్ళ సర్కిల్ నుంచో ఎవరో ఒకరు అమెరికా లో ఉన్నారని చెప్తారు.

అమెరికా లో ఉన్న తెలుగు వారి ముద్ర మెల్లిగా అన్ని రంగాల్లో కనబడుతోంది .. ఇక్కడా .. అక్కడా కూడానూ.

అందుకే ఈ రోజు అమెరికా స్వాతంత్ర దినం గురించి పోస్టు రాస్తే పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు.

అత్తారిల్లు బాగుంటేనే మనమ్మాయి బాగ…

చెత్త టాపిక్

చిత్రం
నా బ్లాగ్ క్వాలిటీ ని శంకించకండి.  అక్షరాలా చెత్త టాపిక్ ఇది .. 

చెత్త .. వేస్ట్ .. ట్రాష్ .. ఎన్ని మాటలు ఉపయోగించినా వాటిలో వ్యక్తమయ్యేది తీసిపారేసే, ఛీత్కార భావమే .. అదే చేస్తున్నాం కూడా .. మన జీవన శైలి వల్ల ఏ చెత్త ఎంత ఎలా పేరుకుపోయి అది ఎక్కడికి పోతోందో అని ఆలోచించట్లేదు. మన జీవన శైలే ఆలోచించనియ్యదు కూడా. మనం చాలా బిజీ. వేళాకోళంగా అనట్లేదు. నిజంగానే అంటున్నాను. మనకి చదువుకొనే అప్పుడు దీని గురించి అవగాహన కల్పించరు కదా. అది కూడా ఓ కారణం. 

హిందీ లో ఓ సామెత ఉంటుంది ... 'జబ్ జాగే వహీ సవేరా' (ఎప్పుడు మేల్కొంటే అప్పుడే తెల్లారినట్టు) అని. 

తెలుగు లో కూడా ఈ అర్ధం వచ్చే సామెత ఉండే ఉంటుంది.. ఇప్పుడు గుర్తు రావట్లేదు. (మీరు గుర్తు చేస్తే కృతజ్ఞురాలిని). 

అందుకే ఎప్పుడు మనకి తెలిస్తే అప్పుడే ఈ విషయం కొంచెం పట్టించుకోవడం మొదలుపెడితే మంచిదే. గిల్టీ ఫీలవ్వక్కర్లేదు. 

నగరం లో ఒక నలుగురు సభ్యులు ఉన్న సగటు కుటుంబం నుంచి ఎంత చెత్త వస్తుందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది మనకి తెలిసిందే. 

పాల ప్యాకెట్ల నుంచీ మొదలు. సరుకుల కవర్లు, పేపర్లు, షాంపూ బాటిల్స్, సోప్ బాక్సులు, టీవీ, ఫ్రిజ్ లాంటి ఎలక్ట…

పదేళ్ళ క్రితం ఈనాడు ఆదివారం పుస్తకం లో వచ్చిన నా కథ

చిత్రం
చిన్నప్పటి నుంచీ ఎంతో ఇష్టంగా చదివే ఈనాడు పుస్తకం లో నా కథ రావడం నా జీవితం లోని ఆనందాల్లో ఒకటి. 
ఆ కథ చదివి నన్ను ఆన్లైన్ లో వెతికి మరీ నా ఫేస్ బుక్ కి మంచి కాంప్లిమెంట్స్ పంపించారు కొంత మంది. ఇది బోనస్ ఆనందం. 
ఆ కథ ఈ రోజు మీ తో షేర్ చేసుకుంటున్నాను. 









ప్లేట్లో వేడి వేడి టిఫిన్...

చిత్రం
2008.... 

అప్పుడే పన్నెండేళ్ళు గడిచిపోయాయా? నిట్టూర్చింది సౌమ్య. 

తెల్లబడుతున్న తన ముంగురులని వెనక్కి తోసుకుని మళ్ళీ రాయనారంభించింది. 

కాలానికి ఏమి? అది అలా వెళ్లిపోతుంటుంది .. అవి మిగిల్చే అనుభవాలతో, జ్ఞాపకాలతో బ్రతకడమే మన పని ... ఏదో ఓ రోజు మనం కూడా కాలం చేస్తాం .. మన తర్వాతి వారికి ఏది మిగిల్చి వెళ్తాము అనేదే  మన చేతిలో ఉన్నది. 

ఇంతవరకూ రాసి కలం పక్కన పెట్టి కళ్ళు మూసుకొని వెనక్కి వాలింది. రైటింగ్ టేబుల్ మీద పెట్టిన కాఫీ ఎప్పుడో చల్లారిపోయింది... తన ఆవేశాల్లాగా ... 

2008... 

అవి నేను బ్లాగ్ లో ఫిక్షన్ అంటే కాల్పనిక సాహిత్యం రాసే రోజులు! కానీ పైన రాసిన లాంటి డ్రమాటిక్ ఫిక్షన్ కాదనుకోండి ... వ్యంగ్యం. (పైన రాసింది కూడా వ్యంగ్యమే అని చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. 😉)

ఫిక్షన్ రాయడం నాకు మహా బోర్ .... నేను చెప్పాలనుకున్న విషయానికి ఓ కథ అల్లి, పాత్రల చిత్రణ చేసి, ఓ ప్రపంచం సృష్టించి.... ఆ పాత్రల చేత అనుకున్న మెసేజ్ ని చెప్పీ చెప్పకుండా చెప్పించడం ... అది దానంతట అదే పాఠకుడికి తట్టేలా చెయ్యడం .. అబ్బో .. చాలా డబుల్ పని. దాని బదులు .. ఇది ఇది .. అది అది .. అని సూటిగా చెప్పేస్తే బోల్డు పేపర్ సేవ్…

డూడ్లింగ్ అను పరధ్యాన చిత్రకళ

చిత్రం
చిన్నప్పుడు స్కూల్ లో నో, పెద్దయ్యాక ఆఫీసు మీటింగ్స్ లోనో, లేదా ఎవరితోనైనా ఫోన్ లో మాట్లాడుతూనో చేతి లో పెన్ను పేపర్ ఉంటే ఏవో గీతాలు గీసేస్తూ ఉంటాం చూడండి ... 

ప్రతి చిన్న పని కి పేరు పెట్టేసే ఇంగ్లీష్ భాష లో దీని పేరు డూడ్లింగ్ ... (doodling). ఆ బొమ్మల్ని డూడుల్స్ (doodles) అంటారు. 

పిచ్చి గీతల్లా అనిపించే ఈ డూడుల్స్ కి మనస్తత్వ శాస్త్రానికి, ధ్యానానికి.. ఇలా చాలా లోతైన సంబంధాలున్నాయట .. వాటితో ఈ రోజు మిమ్మల్ని విసిగిస్తానన్నమాట. 😁

ఎప్పుడైనా గమనించండి .. ఇలా గీసే గీతల్లో ఎవరి స్టైల్ వారిది ఉంటుంది .. మా అక్క ఎక్కువగా కళ్ళు వేస్తుంది .... ఇంద్రుడికి ఒళ్ళంతా కళ్ళు అన్నట్టు మా అక్క ఆలోచిస్తుంటే పేజీ అంతా కళ్ళే ఉంటాయి! (దాని అనుమతి లేకుండా రాసేస్తున్నాను ... ఏం జరుగుతుందో ఏవిటో!) అలాగే కొంత మంది స్టిక్ ఫిగర్స్ .. అంటే ఓ నిలువు గీత .. దాని మీద గుండ్రంగా తల కాయ, ఆ గీత కి అటో రెండు ఇటో రెండు చేతులూ కాళ్ళలాగా గీస్తూ ఉంటారు. మా కజిన్ ఒకమ్మాయి పిచ్చి గీతాలు వెయ్యదు సరికదా ... కళాఖండాలే వేసేస్తూ ఉంటుంది.. ఆ డూడుల్స్ ఏ తాజ్ మహల్ మీదో చెక్కిన చిక్కటి డిజైన్ల లాగా ఉంటాయి .. చిక్కటి అంటే .. సునిశితమై…

ఈ 'గడ్డ' పై మమకారం

చిత్రం
బంగాళా దుంప లేదా ఆలు గడ్డ - ఇది నచ్చని వారిని నేను అనుమానిస్తాను. వీళ్ళు చాలా తేడా మనుషులై ఉంటారు నా అభిప్రాయం లో. కేవలం వాళ్ళకొక ప్రత్యేకత ఏర్పాటు చేసుకోవటం  కోసం 'ఆ .. మాకు ఆలు అంత గా నచ్చదు' అని అనే రకం. లేకపోతే జీవితం లో అసలైన ఆనందం ఇచ్చేవి - వాన, ఇంద్రధనుస్సు, పువ్వులు .. వీటి తో పాటు 'ఆలు' కూడా పడని రకం. లేకపోతే ఈ దుంప ఎంత తినేసారంటే ఇంక వెగటు పుట్టేసిన రకం. ఇది విశ్వామిత్ర సృష్టి అని జడ్జి చేసే రకం. లేదా మనసు లో ఇష్టం ఉన్నా డైటింగ్ పేరుతో దూరం పెడుతున్న రకం. ఏ రకమైనా వీళ్ళ తో స్నేహం చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే. 
లేకపోతే ఏవిటండి .. బంగాళా దుంప ఎంత అపురూపమైన సృష్టి! ఇది లేకపోతే మాత్రం ఖచ్చితంగా సృష్టి లో ఏదో లోపం ఉండేది. అయినా దాని గొప్పతనం వర్ణించ నేనెంత! 
నేను ఈ మధ్యే ఓ ప్రొమోషన్ సంపాదించాను. వంటింట్లో. వంట లో నెక్స్ట్ స్థాయి కి వెళ్ళాను అని అప్పటి నుంచి తెగ విర్రవీగుతున్నాను. 
ఆ ప్రొమోషన్ గురించి చెప్పే ముందు కొంత నేపథ్యం, స్థల పురాణం ... ఇలాంటివి చెప్పుకోవడం చాలా ముఖ్యం. 
బంగాళా దుంపల్లో చాలా రకాలున్నాయి. పంట పండించే వాళ్ళకి, వంట వండే వాళ్ళకి తెల…

యే కౌన్ చిత్రకార్ హై ...

చిత్రం
ఈ బ్లాగ్ పోస్ట్ లో నా పని చాలా సులువు.

నా ప్రయత్నం ఎప్పుడూ నా మనసు కి తాకిన అనుభూతులని పంచుకోవడమే. అది మాటల్లో పెట్టడం ఒక బాధ్యత గల పని గానే భావిస్తాను.

కానీ ఈ రోజు నేను పంచుకోబోతున్న అనుభూతిని నేను పరిచయం చేస్తే చాలు. వర్ణించక్కర్లేదు. మీకు మీరుగా అనుభూతి చెందే వీలుంది.



ఈ ఫోటో లో అమ్మాయి మోడల్ కాదు. యూట్యూబ్ లో ఒక ఛానెల్ నిర్వహిస్తుంది. ఈ ఛానెల్ లో ఒక్కొక్క వీడియో మన ని ఆమె లోకానికి తీస్కెళ్ళిపోతుందంటే నమ్మండి! 
ఆమె పేరు యోనా. Jonna Jinton. (వాళ్ళ భాష లో 'జె' అక్షరం 'య' గా పలుకుతారు) స్వీడన్ లో పది గడపలు ఉన్న పల్లెటూరిలో ఉంటుంది. ఈ పల్లె ప్రత్యేకత ఉత్తరధృవానికి దగ్గరగా ఉండటం. 
ఇక్కడ భూమి మనకి పరిచయం లేని ఎన్నో రంగులు చూపిస్తుంది .. అక్షరాలా.  ట్రావెలింగ్ ఆసక్తి ఉన్న ఎవరైనా నార్తర్న్ లైట్స్ గురించి వినుంటారు. ఉత్తర ధృవానికి దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో ఆకాశం కొన్ని కాలాల్లో రంగురంగులు గా మెరవటమే నార్తర్న్ లైట్స్ అంటే. 
ఇది చూడటానికి ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించి, కొన్ని లక్షలు ఖర్చుపెట్టడానికి కూడా వెనకాడరు ఔత్సాహికులు. అలాంటిది ఆమె ఇల్లు ఆ లైట్ల కిందే! 
ఇదంతా యాదృచ్చి…