నేను రాసిన ఓ ఉర్దూ ఘజల్
నాకు ఘజల్స్ అంటే చాలా ఇష్టం. నాకు సంగీతం ఎంత ఇష్టమో సాహిత్యం అంత ఇష్టం ... అందుకే ఈ ప్రక్రియ అంటే అంత అనుబంధం ఏర్పడింది. మొహసిన్ నఖ్వీ , గాలిబ్, నాసిర్ కాజ్మి ఇలాంటి ఉర్దూ కవులు రాసిన పదాలకి ... జగ్జీత్ సింగ్, గులాం అలీ, మెహదీ హాసన్ వంటి వారి స్వరాలు, గళాలు తోడైనప్పుడు ఒక అందమైన ఘజల్ పుడుతుంది (ఈ కింది ఘజల్స్ మీద క్లిక్ చేస్తే యూట్యూబ్ కి వెళ్ళచ్చు ) దిల్ ధడక్ నే కా సబబ్ యాద్ ఆయా .. వొ తేరి యాద్ థీ .. అబ్ యాద్ ఆయా రంజిష్ హీ సహీ ... దిల్ హీ దుఖానే కేలియే ఆ ... ఆ ఫిర్ సే ముఝే ఛోడ్ కే జానే కేలియే ఆ . తుమ్ నహీ ... ఘమ్ నహీ .. షరాబ్ నహీ ... ఏసి తన్ హాయి కా జవాబ్ నహీ ... వివిధ భారతి లో అప్పుడప్పుడూ ఘజల్స్ వినిపిస్తూ ఉంటారు .. అలా surprise గా దొరికిన ఒక rare ఘజల్ .. రూపా గాంగూలి పాడిన 'తేరే కరీబ్ ఆకే .. బడీ ఉల్ఝనో( మే హూ .. మే దుష్మనో మే హూ కే తేరే దోస్తో మే హూ' అనే ఘజల్! ఘజల్ అంటే చేతిలో మందు సీసా ఉండాల్సిందే అంటే నేను ఒప్పుకోను ఘజలే ఒక మందు సీసా 😉😉 అన్ని ఘజల్స్ విరహం, రాతి గుండె ప్రేయసి, ఒంటరి తనం, మోస పోవటం .. ఇలాంటి వాటి చుట్టూనే ఉండవు .. కొన్ని