Posts

Showing posts from May 24, 2020

ఈ 'గడ్డ' పై మమకారం

Image
బంగాళా దుంప లేదా ఆలు గడ్డ - ఇది నచ్చని వారిని నేను అనుమానిస్తాను. వీళ్ళు చాలా తేడా మనుషులై ఉంటారు నా అభిప్రాయం లో. కేవలం వాళ్ళకొక ప్రత్యేకత ఏర్పాటు చేసుకోవటం  కోసం 'ఆ .. మాకు ఆలు అంత గా నచ్చదు' అని అనే రకం. లేకపోతే జీవితం లో అసలైన ఆనందం ఇచ్చేవి - వాన, ఇంద్రధనుస్సు, పువ్వులు .. వీటి తో పాటు 'ఆలు' కూడా పడని రకం. లేకపోతే ఈ దుంప ఎంత తినేసారంటే ఇంక వెగటు పుట్టేసిన రకం. ఇది విశ్వామిత్ర సృష్టి అని జడ్జి చేసే రకం. లేదా మనసు లో ఇష్టం ఉన్నా డైటింగ్ పేరుతో దూరం పెడుతున్న రకం. ఏ రకమైనా వీళ్ళ తో స్నేహం చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే.  లేకపోతే ఏవిటండి .. బంగాళా దుంప ఎంత అపురూపమైన సృష్టి! ఇది లేకపోతే మాత్రం ఖచ్చితంగా సృష్టి లో ఏదో లోపం ఉండేది. అయినా దాని గొప్పతనం వర్ణించ నేనెంత!  నేను ఈ మధ్యే ఓ ప్రొమోషన్ సంపాదించాను. వంటింట్లో. వంట లో నెక్స్ట్ స్థాయి కి వెళ్ళాను అని అప్పటి నుంచి తెగ విర్రవీగుతున్నాను.  ఆ ప్రొమోషన్ గురించి చెప్పే ముందు కొంత నేపథ్యం, స్థల పురాణం ... ఇలాంటివి చెప్పుకోవడం చాలా ముఖ్యం.  బంగాళా దుంపల్లో చాలా రకాలున్నాయి. పంట పండించే వాళ్ళకి,