వీకెండ్ స్వాతంత్రం
సముద్రం లో ఉప్పుకి చెట్టు మీద కాయకి లంకె పెట్టిన ఆ దేవుడే తెలుగు వాళ్ళకి అమెరికా కి కూడా లింకు పెట్టేసాడు. ఇప్పుడు మనకి చాలా కామన్ అయిపోయింది కానీ అసలు ఎంత విచిత్రం! ఎక్కడ తెలుగు రాష్ట్రాలు? ఎక్కడ అమెరికా? వేల కిలోమీటర్ల దూరమే కాదు భావజాలాలు, వాతావరణాలు, సంస్కృతుల్లో బోల్డు తేడా. ఏంటో అలా రాసి పెట్టి ఉంది అనుకోవడమే తప్ప లాజిక్ కి అందనిది ఈ పరిణామం! ఇప్పుడు అమెరికా డాలర్, అమెరికా రాజనైతిక, సామజిక పరిస్థితుల్లో ఏ మాత్రం తేడా వచ్చినా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో 'కాల్'కలం మొదలైపోతుంది .. 'అంతా బానే ఉన్నారా?' 'మీ ఏరియా లో ఎలా ఉంది?' 'జాగ్రత్త గా ఉండండి' .... కాల్ కట్ .. వర్రీ మొదలు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇంటికి వెళ్లి సర్వే చేసిన వారి కుటుంబం నుంచో, చుట్టాల నుంచో లేదా కనీసం తెలిసిన వాళ్ళ సర్కిల్ నుంచో ఎవరో ఒకరు అమెరికా లో ఉన్నారని చెప్తారు. అమెరికా లో ఉన్న తెలుగు వారి ముద్ర మెల్లిగా అన్ని రంగాల్లో కనబడుతోంది .. ఇక్కడా .. అక్కడా కూడానూ. అందుకే ఈ రోజు అమెరికా స్వాతంత్ర దినం గురించి పోస్టు రాస్తే పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. అత్తారిల్లు బాగుంటేనే మనమ్మాయి బా