Posts

Showing posts from October 7, 2018

#metoo

ఈ పోస్టు లో ప్రముఖుల పేర్లు, లైంగిక వేధింపుల వివరాలు ఆశిస్తే మీరు ఇక్కడే చదవడం ఆపేయచ్చు.  నేను వ్యక్తిగతంగా చూసిన, సహించిన.. సహించని కొన్ని అనుభవాలు, వాటి వల్ల అమ్మాయిల జీవితాలు ఎలా negative గా ఎఫెక్ట్ అవుతున్నాయో చెప్తాను.  ఇది చాలా వ్యక్తిగతమైన పోస్టు. రాయడం చాలా కష్టం కూడా అవుతోంది. కానీ ఎందుకో ఈ టాపిక్ avoid చెయ్యాలనిపించట్లేదు.  #metoo అని బయటికొచ్చిన ఆడవాళ్ళందరూ ఒకటే మాట అంటున్నారు ... ఈ గుండె బరువు దింపేసుకోవాలని చెప్పుకుంటున్నామని. నేనూ అంతే.  నాకు ఐదు-ఆరేళ్ళ వయసు అప్పుడు... వీధి చివర ఓ pervert రోడ్డు మీద నుంచొని వెకిలి చేష్టలు చేసేవాడు .. నలుగురు ఐదుగురం కలిసే స్కూల్ కి వెళ్ళేవాళ్ళం ... అయినా వాడు భయపడే వాడు కాదు. కానీ మా పిల్లలందరికీ వాడంటే భయం. వాడు చేసేవాటిలో ఏదో తప్పు ఉంది .. ఏదో harm ఉంది అని తెలుస్తూ ఉండేది. ఇంక ఒక్కళ్ళం వెళ్లాల్సి వస్తే బిక్కచచ్చిపోయేవాళ్ళం. వాడు రోడ్డు మీద లేకపోతే ఎంత రిలీఫ్ గా ఉండేదో. ఇది తాడేపల్లిగూడెం లో.  హైదరాబాద్ లో మా వంటింటి కిటికీ లోంచి రైల్వే ట్రాక్ కనిపించేది. అక్కడా ఇలాంటి అనుభవమే. ఆ ఇంటి నుంచి మేము వెళ్ళిపోడానికి అది