Posts

Showing posts from March 8, 2020

తల్లి ఆరాటం

Image
నేను కిందటి వారం లిటిల్ విమెన్ నవల గురించి రాసాను కదా .. ఆ నవల ఐప్యాడ్ లో  ఆపిల్ బుక్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకొని చదివాను.  ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే ఈ పఠనానుభవం బహు సౌలభ్యంగానున్నది.  నేను చదివిన నవల మన మాతృ భాష కాదు ...పైగా 152 ఏళ్ళ క్రితం రాసినది. నాకు అంతగా పరిచయం లేని కొన్ని పదాలు, వాడుకలు, అలవాట్లు, నవల్లో పాత్రలు ప్రస్తావించిన నాటకాలు, పుస్తకాలు... ఇవి ఎదురైనప్పుడల్లా ...  వెంటనే గూగుల్ చేసుకొనే అవకాశం కల్పించింది ఐ ప్యాడ్.  ఉదాహరణ కి  అసలు SARTOR RESARTUS అనే మాట నేను ఎప్పుడూ వినలేదు .. అది ఇంగ్లీష్ అని ఎవరైనా చెప్తే నేను నమ్మేదాన్ని కూడా కాదు. మరి ఇక్కడ ఆ పదానికి అర్ధం తెలియకుండా భావం తెలియడం కష్టమే. అప్పుడు ఆ పదాన్ని సెలెక్ట్ చేసుకొని 'లుక్ అప్' అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను.  అప్పుడు తెలిసిన విషయం ఇది. .  థామస్ కార్లైల్ అనే ఆయన బట్టల ప్రాముఖ్యత మీద రాసిన ఓ కామెడీ పుస్తకం అది అని. ఇప్పుడు భావం కూడా అర్ధం అయింది.  అలాగే పుస్తకం లో నాకు నచ్చిన అంశాలు హైలైట్ చేసుకొనే వీలు కల్పించింది. మామూలు పుస్తకాల్లాగే బుక్మార్క్ చేస్కోవచ్చు. మ