Posts

Showing posts from October 21, 2018

ఎందు'క్యూ'?

నాకు క్యూ ల తో అపారమైన అనుభవం ఉంది.  రేషన్ షాపు, బస్ పాస్ రెన్యూవల్, ఈ సేవ, సినిమా టికెట్, ట్రెయిన్ రిజర్వేషన్, సూపర్ మార్కెట్ బిల్ కౌంటర్, బ్యాంకులు, పాస్పోర్ట్ ఆఫీసు లలో కొన్నేళ్లు చెప్పులు అరగదీసియున్నాను  (ఆన్లైన్ దయ వల్ల కొన్ని తప్పుతున్నాయి!)  మన సంప్రదాయం లో క్యూలన్నిటికి తలమానికమైనది తిరుమల క్యూ.  తిరుమల క్యూల నిలయం ... అసలు ముందు తిరుమల దర్శనానికి వెళ్లాలంటేనే బయో మెట్రిక్ క్యూ లో నుంచోవాలి. తర్వాత అకామడేషన్ క్యూ. దర్శనం క్యూ సరేసరి. తర్వాత లడ్డూ క్యూ. ఉచిత భోజనం చెయ్యాలంటే అక్కడ కూడా క్యూ.  ఇన్ని దైవిక, లౌకిక క్యూ లలో కొన్ని గంటలు గడిపిన అనుభవ సారం ... ఈ కింది 'క్యూ'లంకషమైన లిస్టు.  క్యూలలో కామన్ గా కనిపించే వివిధ రకాల మనుషులు:  అయోమయం జగన్నాధం - ఈ వ్యక్తి కి అన్నీ డౌట్లే .... అసలు ముందు తప్పు క్యూ లో అరగంట నుంచొని ఎవరో చెప్తే సరైన క్యూ లోకి వస్తారు. వచ్చాక కూడా ఒకరిద్దరి కంటే ఎక్కువ మంది తో సలహా సంప్రదింపులు జరుపుతారు ..  వీళ్ళ చేతిలోంచి పేపర్లు పడిపోతూ ఉంటాయి ... పెన్నుండదు... భీత హరిణాల వంటి చూపుల తో చుట్టూ చూస్తుంటారు ... వీళ్ళ పరిస్థితి