పన్నీటి జల్లు
మొన్న ఇనార్బిట్ మాల్ కి వెళ్ళినప్పుడు ఒక చిన్న షాపు కనిపించింది. 'మేక్ యువర్ ఓన్ పెర్ఫ్యూమ్' ... మీ అత్తరు మీరే తయారు చేస్కోండి అని. అక్కడ ఉన్న పెర్ఫ్యూమర్ (పెర్ఫ్యూమ్ అమ్మే వారిని అలా పిలుస్తారని ఇప్పుడే తెలిసింది) రకరకాల వాసనలు ఒక దళసరి పేపర్ ముక్క మీద జల్లి చూపించాడు. అన్ని వాసనలు వరసగా చూసి confuse అవ్వకుండా మధ్య మధ్య లో కాఫీ గింజలు వాసన చూపిస్తారు. అది మళ్ళీ మన ముక్కు ని రీసెట్ చేస్తుందన్నమాట! వాటిలో మనకి నచ్చింది ఒకటి కానీ, రెండిటి మిశ్రమం కానీ తయారు చేస్కోవచ్చు. వాటిని తగు పాళ్ళలో ఓ బాటిల్ లో వేసి ఇస్తాడు. అంతే. అదే మన కోసం మనం ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్న పెర్ఫ్యూమ్ అన్నమాట. ధర 2500 రూపాయల నుంచి మొదలవుతుంది. మనం ఎంచుకున్న అత్తరు బట్టీ. నేను కొనలేదు కానీ ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వడానికి చాలా బాగుంటుంది అనిపించింది. నేనసలు పెర్ఫ్యూమ్ వాడే దాన్ని కాదు .... ఒకటి... మధ్య తరగతి ఇళ్లలో ఇలాంటి విషయాల్లో ఇంట్రస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే తప్పించి ఇవి అలవాటు అవ్వవు. నెలసరి బడ్జెట్ లో రెండు, మూడు వేల రూపాయలు లేదా అంత కంటే ఖరీదు చేసే వస్తువు ... ముఖ్యంగా ప్రాక్టికల్ యూజ్ లేనిది అస్సలు