నుమాయిషీవైభవం
హైదరాబాద్ లో ఉంటూ నుమాయిష్ కి వెళ్ళకపోతే ఈ నగరానికి ద్రోహం చేసినట్టే. రోడ్డు మీద, బిల్డింగ్ మెట్ల మీద జర్దా ఉమ్ములు ఉమ్మే వాళ్ళ పాపం కంటే పెద్దది ఇది. పాప భీతి తో కాకపోయినా షాపింగ్ ప్రీతి తో ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరుల్లో నాంపల్లి లో జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ఉరఫ్ ఎగ్జిబిషన్ అని పిలుచుకోబడే నుమాయిష్ కి నేను తప్పనిసరిగా వెళ్తాను. గత 20 ఏళ్ళు గా ఏదో ఒకటో రెండో సంవత్సరాలు మిస్ అయ్యుంటానేమో. నాకు ఆ వాతావరణం చాలా నచ్చుతుంది. (పైగా మా ఇంటికి దగ్గర.) మాల్స్ రాక దశాబ్దాల మునుపే ప్రారంభమైన షాపింగ్ కల్చర్ ఇది! నగరం లో జరిగే ఈ జాతర సజావు గా సాగడానికి పోలీసులు చాలా కష్టపడతారు! ఏసీ లేకపోయినా చలికాలం అవ్వడం వాళ్ళ ఆహ్లాదకరమైన వాతావరణం. అంత మంది జనం... అన్ని లైట్ల వల్లనో ఏమో చలి అనిపించదు. నుమాయిష్ లో నాకు అత్యంత ప్రీతికరమైన విషయం... పాత హిందీ పాటలు నిరంతరాయంగా స్పీకర్లలో వస్తూ ఉండటం! అంత కన్నా ఇష్టం .. మన చుట్టూ ఉన్న కొంత మంది వాటి తో పాడుతూ ఉండటం! నిన్న కిషోర్ కుమార్ పాట వస్తోంది 'తేరీ దునియా సే ... హోకే మజ్బూర్ చలా .... మే బహుత్ దూర్ .