అంట్లు తోమడం - ఓ అధ్యయనం
ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు నేను అంట్లు తోమాలి. మా ఇంట్లో అంట్లే. మా డొమెస్టిక్ హెల్ప్ పెళ్లి కి వెళ్ళింది. అందుకని. First things first, నాకు పనిమనిషి అనే పదం కంటే డొమెస్టిక్ హెల్ప్ అనటమే ఇష్టం (ఈ టాపిక్ మీద తర్వాత మాట్లాడుకుందాం) మా 'హెల్ప్' రాకపోవటం వల్ల ఆమె చేసే ఇంటెడు పని ని మాలో మేమే పంచుకోవడం లో - నేను ఇష్టం గా తీసుకున్న పని అంట్లు తోమడం. ఎందుకు ఇష్టమో .. చివర్లో చెప్తాను. ఏ పని చేసినా నా షరతుల మీద చెయ్యటం నాకు అలవాటు. 1. నేను రోజుకి ఒక్క సారే తోముతాను. ఎన్ని పడినా ఫర్వాలేదు. 2. పెద్ద కుక్కర్ తోమను. అది తోమాలంటే నీరసం... తోమాక ఆయాసం. అందుకే. 3. నేను తోముతుంటే మధ్యమధ్య లో కొత్త అంట్లు వెయ్యకూడదు. అన్నీ ఒకే సారి వేసేయాలి. 4. మధ్యమధ్యలో ఆ గరిట కావాలి, ఈ ప్లేట్ కావాలి అని అడగకూడదు. అన్నీ అయ్యాకే వాడుకోవాలి. ఇంట్లో వాళ్ళు కాబట్టి ఇన్ని షరతులకీ ఒప్పుకొని పని చేయించుకుంటారు పాపం. ఒక్కోసారి మా 'హెల్ప్' వచ్చే వరకూ కంచాలు, టిఫిన్ ప్లేట్లు throw-out వి వాడటం కూడా కద్దు! మా వాళ్ళు అంత దయార్ద్రహృదయులు 😊 నేను అంట్లు తోమాలంటే పీచు, విమ్ సరిపోవు. Laptop, blue tooth earp