వ్యసనానికి మందు
వ్యసనాల గురించి మనందరికీ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. వ్యసనపరుల్ని అసహ్యించుకుంటాం. బలహీనులు గా చూస్తాం. డిసిప్లిన్ లేని వాళ్ళు అని చులకన చేస్తాం. వాళ్ళు మారనందుకు కోప్పడతాం... విసిగిపోయి వాళ్ళని వెలేస్తాం. అలాగే వ్యసనం అనే హెడ్డింగ్ కింద కొన్ని పేర్లే రాస్తాం ... తాగుడు, డ్రగ్స్, జూదం... ఇలా. నేను చదివిన, చూసిన, అనుభవించిన విషయాలని పరిశీలిస్తే ఇది పూర్తి నిజం కాదు అని తెలిసింది. వ్యసనాలని ఈ మధ్య ఓ వ్యాధి గా పరిగణించడం మొదలు పెట్టారు. ('మహానటి' సినిమా లో డైలాగ్ గుర్తుందా?) నాకు ఇది సబబు గా అనిపించింది. ఇది కూడా ఓ వ్యాధే అని తెలిస్తే మన కటువైన దృష్టి కోణం మారుతుంది. (తలనొప్పి వచ్చినవాడ్ని చూసి జాలి పడతాం, సహాయపడతాం కానీ అసహ్యించుకోము కదా) ఇది జబ్బే. దీనికి చికిత్స కావాలి. అది కూడా ప్రొఫెషనల్ చికిత్స. తాగనని పెళ్ళాం బిడ్డల మీద, దేవుళ్ళ మీద ఒట్టేయించుకోవడం లాంటివి కాదు దీనికి మందు. వ్యసనానికి ఓ కారణం పలాయనవాదం. నిజ జీవితం భరింపరానిది గా మారినప్పుడు, ఎదుర్కొనే శక్తి లేనప్పుడు.. ఏదో ఎస్కేప్ వెతుక్కుంటాం. మనకి తోచిన వ్యసనాన్ని మనం ఎంచు