Posts

Showing posts from April 5, 2020

స్వాభినందన మందార మాల

కొందరి మాటలు వింటున్నప్పుడు .... చెవి లోపల నొప్పి కాదు కానీ బయట కి కనిపించే చెవి దొప్పలు నొప్పి రావడం ఎప్పుడైనా అనుభవించారా? అది ఎవరూ ఎప్పుడూ అనుభవించకూడదనే ఆశిస్తాను. ఇలాంటి అనుభవాలు అయ్యాయి నాకు. అన్ని సార్లూ ఒకే కామన్ పాయింట్... ఎవరు మాట్లాడగా అయితే నేను వింటున్నానో వారు ఒకటే స్వోత్కర్ష! గంటల తరబడి!  ముందు పావు గంట "అలాగా! భలే! చాలా మంచి విషయం" అని మనస్ఫూర్తి గానే అభినందించాను. అది అగ్ని లో ఆజ్యం పోసినట్టయింది. ఇంక వారు ఆపే ప్రయత్నం చెయ్యలేదు.   రెండో సారి అయితే మరీ అన్యాయం ... ఓ పర్సనల్ ట్రాజెడీ మధ్య మొదలెట్టేసారో వ్యక్తి ఈ ధోరణి! ఈ వ్యక్తులు చిన్న పిల్లలేమీ కారు ..  ఒక వ్యక్తి తాను ఎంత అదృష్టవంతులో .... అన్నీ తనకి ఎలా కలిసొచ్చేసాయో ... సొంతిల్లు జేబులో వంద రూపాయలుండగా ఎలా కొనగలిగారో ఇలా చెప్పుకొస్తే ... ఇంకొక వ్యక్తి తాను ఆఫీసులో ఎంత బాగా పని చేస్తానో  ... అందరూ తనని ఎలా  పొగుడుతారో చెప్పుకుంటూనే ఉన్నారు.  ముందే చెప్పినట్టు, నా వయసు వాళ్ళు, ఒకే చోట కూర్చొని జీవితం లో విజయాలు షేర్ చేసుకొనే సందర్భం అయితే ఎందుకు వినం ... ఎందుకు ఆనందించం? కానీ సమయం, సందర్భం చూస్కో