(ఈ విషయం లో) అందరం ఒకటే!
చిన్నప్పటి నుంచి భిన్న సంస్కృతుల్ని పరిచయం చేస్కోవడం నాకు చాలా ఇష్టం. నేను పెరిగిన వాతావరణం కూడా నాకు అలాంటి అవకాశాలు కల్పించడం నా అదృష్టం. హైద్రాబాద్ లో ఉండటం వల్ల కలిగిన అలాంటి ఓ మంచి అవకాశం - ముస్లిం సంస్కృతి కి దగ్గరగా ఉండటం. మూడో క్లాసు నుంచి ఇంటర్మీడియేట్, డిగ్రీ, మళ్ళీ నేను లెక్చరర్ అయ్యే దాకా బోల్డు మంది ముస్లిం ఫ్రెండ్స్ ఉండేవారు నాకు. (చిన్నప్పటి స్నేహాల లాగే వీరి తో కొంచెం టచ్ పోయింది ... కానీ మనసులో స్నేహం అలాగే ఉంది). మా ఇంట్లో అమ్మా, నాన్నల నుంచి కూడా 'వీరి తో మాట్లాడద్దు, వీరి ని అక్కడే ఉంచు' .. ఇలాంటి ప్రెషర్ ఉండేది కాదు.... ఇది ఇంకో అదృష్టం గా భావిస్తాను. ఎన్ని పోరాటాలు, ఏ బిల్లులు, ఏ పరిస్థితులు, ఏ మహానుభావుల మానవతా స్పృహ - అందరూ కలిసి చదువుకొనే స్వాతంత్రాన్ని కలిగించాయో వాటికి/వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఎందుకంటే గిరి గీసుకొని మనలాంటి వాళ్ళే కలిసి ఉండాలి, కలిసి చదువుకోవాలి అంటే వారి ప్రపంచం మనకి తెలిసే అవకాశం ఉండదు... దీని వల్ల దూరాలు పెరుగుతాయి కానీ తగ్గవు .. ఇంకో ప్రాబ్లమ్ ... మనం గీసుకున్న గిరి అక్కడే ఆగదు ... సబ్ - కేటగ