Posts

Showing posts from April 26, 2020

కలర్ కలర్.... వాట్ కలర్ డూ యూ వాంట్?

Image
మనోళ్ళకి ఈ తెల్ల చర్మం పిచ్చి ఎందుకంటారు?     ఒక సింపుల్ జవాబు - తెలుపు మంచికి నలుపు చెడ్డ కి సంకేతాలు గా భావిస్తాం. ఇది చర్మం రంగు కి కూడా ఆపాదించాలి అని ఎందుకు అనిపించిందో మనకి? మనిషి చర్మమే కాదు .. జంతువులని కూడా ఈ 'వర్ణ' విభేదాల నుంచి మినహాయించలేదు కదా ... నల్ల పిల్లి, నల్ల కుక్క, కర్రి ఆవు ... ఇలా. వీటిలో కొన్ని మంచి శకునాలు, కొన్ని దుశ్శకునాలూనూ. (కోడి లాంటివి ఈ కలర్ పాలిటిక్స్ నుంచి బానే తప్పించుకున్నాయి). మన వ్యవహార భాష లో కూడా 'ఆ పిల్ల మంచి రంగు' అంటే తెల్లగా ఉంటుందనే అర్ధం.    ఇంగ్లీషు లో ఫెయిర్ అంటే తెలుపు అని, న్యాయం అని రెండు అర్ధాలు ఉన్నాయి కదా. వాళ్ళు అసలు రెండో అర్ధం లోనే ఫెయిర్ ఎక్కువ వాడతారు. మొదటి అర్ధం మన వాళ్ళు ఎక్కువ వాడతారు. సో, ఓ తెలుగు వాడు పెళ్లి సంబంధం చూసే అప్పుడు 'అమ్మాయి ఫెయిర్ గా ఉండాలండి' అంటే 'న్యాయంగా ఉండాలండి' అనే అర్ధం వస్తుందన్నమాట! హ్హహా! 😉 జీవితాన్ని ఏ కొంచెం చూసిన ఎవరైనా ఒప్పుకుంటారు .. చర్మం రంగు తో గుణానికి ఏ మాత్రం సంబంధం ఉండదని. అయినా తెలుపు వైపే మొగ్గు చూపిస్తారు. ఎందుకు?  అందానికి కూడా రంగు తో సంబంధ