కాలమహిమ
'టైం ని మనిషి సృష్టించాడు' అని ఎవరో అన్నారు నా తో కొన్నేళ్ల క్రితం. అదెంత వరకూ నిజమో తెలుసుకుందామని యధావిధి గా రీసెర్చ్ చేస్తే మహా ఆసక్తి కరమైన విషయాలు తెలిసాయి! ఉదాహరణ కి ఇది చూడండి. కాంతి మనని చేరడానికి టైం పడుతుంది. అందుకే మనం చూసేదంతా గతమేనట! కిటికీ బయట మనం చూస్తున్న సూర్యుడు ఎనిమిది నిముషాల ఇరవై సెకన్ల క్రితం సూర్యుడు! భూమి కి అతి దగ్గరగా కనిపించే నక్షత్రం మీరు ఈ రోజు చూస్తున్నట్టయితే మీరు చూస్తోంది నాలుగేళ్ళ క్రితం నక్షత్రాన్ని. క్రికెట్ లాంటివి లైవ్ టెలికాస్ట్ చేసే అప్పుడు ఏడున్నర నిముషాలు ఆపి చేస్తారు ... ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే కవర్ చేసుకోవచ్చని ... నాకు సూర్యుడి నిజం తెలిసాక ఇది గుర్తొచ్చి నవ్వొచ్చింది ... కారణం ఏదైనా మన లైవ్ టెలికాస్ట్ లైవ్ టెలికాస్ట్ కాదన్నమాట!!! టైం గురించిన విషయాలు ఈ టైం లో మీకు టైం తెలీకుండా ఉండేందుకు... భూమి మీద ఎప్పుడూ సంవత్సరానికి 365 రోజులు లేవు. డైనోసార్ల కాలం లో సంవత్సరానికి 370 రోజులుట. కానీ రోజుకి 23 గంటలే. కాలం గడుస్తున్న కొద్దీ చంద్రుడి ఆకర్షణ ఎక్కువై , భూమి ఆత్మ ప్రదక్షిణ స్లో అవుతోంది ... ప్రతి వంద