కథాలాపం
స్కూల్ లో కొత్త సంవత్సరం టెక్స్ట్ బుక్స్ రాగానే హిందీ, ఇంగ్లీష్, తెలుగు టెక్స్ట్ లు వరస పెట్టి చదివేసే దాన్ని నేను. (సైన్స్, మ్యాథ్స్ పుస్తకాలు సంవత్సరం చివరికి కూడా కొన్నప్పటి లాగే కొత్తగానే ఉండేవి ... అది వేరే సంగతి. ) ఫస్ట్ క్లాస్ నుంచి ఇదే అలవాటు. ముఖ్యంగా ఇంగ్లీషు టెక్స్ట్ లు. నావి చదవడం అయిపోయాక అక్కవి. అక్క దాని టెక్స్ట్ లో కథలు చదివి explain చేసేది... నన్నూ అమ్మని కూర్చోబెట్టి! 'ప్రైడ్ అండ్ ప్రెజుడీస్' గురించి అక్క ద్వారానే ఫస్ట్ విన్నాను నేను. పోయెట్రీ కంటే ఫిక్షన్ వైపే ఎక్కువ ఇంట్రస్ట్ ఉండేది. అలాగే షార్ట్ స్టోరీస్ .. చిన్న కథలనే రచనా ప్రక్రియ ని పరిచయం చేసినవి కూడా స్కూల్ పుస్తకాలే! ఇప్పటికీ నేను వదలలేని రచయితలని మొదట పరిచయం చేసింది స్కూల్ టెక్స్ట్ బుక్కులే ... డికెన్స్, టాల్స్టాయ్, జేన్ ఆస్టెన్, ఓ హెన్రీ, ఆస్కార్ వైల్డ్, ఆర్థర్ కానన్ డోయల్, మపాసా... నాకు ఓ ప్రాబ్లెమ్ ఉంది. కథ ని కథ లాగా చదవలేను. బాగా మనసుకి పట్టించేస్కుంటూ ఉంటాను. అలా నా జీవితం లో పెద్ద మార్పుల్ని తీసుకొచ్చిన చిన్న కథలని ఈ రోజు గుర్తుచేసుకుంటున్నాను. 1. God sees the truth, b