Posts

Showing posts from January 8, 2023

ట్రిబ్యూట్ టు అవర్ డాడ్

Image
డిసెంబర్ పదిహేనో తారీఖున మా నాన్న గారు వెళ్లిపోయారు.  గత కొన్ని మాసాలుగా అస్వస్థులుగా ఉన్నారు.  ఇక్కడి నా కమ్యూనిటీ కి ఈ విషయం షేర్ చేస్కోవాలనిపించి రాస్తున్నాను.  మా నాన్న గారికి ఓ చిన్న ట్రిబ్యూట్ ని మా 'సా పా సా' ఛానెల్ లో అప్లోడ్ చేసాం. అదే ఇక్కడ కూడా పోస్టు చేస్తున్నాను.  మా నాన్న గారి కి మెలోడ్రామా అస్సలు ఇష్టం ఉండదు... ఉండేది కాదు (నాన్న గారి విషయం లో past tense వాడటం ఇప్పుడిప్పుడే అలవాటవుతోంది). ఎంత పెద్ద కష్టమైనా మూవ్ ఆన్ అయిపోవడమే కరెక్ట్ అనేవారు. ఆ స్ఫూర్తి తోనే మళ్ళీ రొటీన్ లో పడటానికి ప్రయత్నిస్తున్నాం మేము.  నా ప్రతి బ్లాగ్ పోస్టు చదివేవారు డాడ్.  కవి హృదయం   పోస్టు లో రెండు తలల దూడ కవిత కి ఆయన వాట్సాప్ లో నాకు కామెంట్ పంపించారు. ఆ దూడని బతికుండగా చూడలేని లోకం museum లో పెడితే మాత్రం చూడటానికి వెళ్తుంది మరి ... అని అన్నారు. నాకు నిజమే కదా అనిపించింది.  ఆఖరి పోస్టు ఆయన పోయిన రోజు రాసాను  .. కొన్ని గంటల ముందు. అదొక్కటే చదవలేకపోయారు.  వచ్చే పోస్టు త్వరలో రాస్తాను. నార్మల్సి కి మళ్ళీ వచ్చినట్టు అనిపిస్తుంది అప్పుడు. ...