విశ్వనాథ్ గారికి స్మృత్యంజలి
విశ్వనాథ్ గారి తో నాకు కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి అని చెప్పుకోవడం ఓ అదృష్టం గా భావిస్తున్నాను. తెలుగు వారి గా పుట్టి విశ్వనాథ్ గారి గొప్పతనం తెలియకపోవడం అసంభవం. మన ఇళ్లలో పిల్లలకి పరిచయం చేసే తెలుగు సంస్కృతి లో ఆయన సినిమాలు, పాటలు, సన్నివేశాలు ఎప్పుడో ఓ భాగమైపోయాయి. నా పోస్టు గా .. మా .. నీ.. లో విశ్వనాథ్ గారు సృష్టించిన సాగర సంగమం లో 'బాలు' పాత్ర గురించి రాసే అప్పుడు 'మొదటి సారి సాగర సంగమం ఎప్పుడు చూశానో గుర్తులేదు ... .. మొదటి ఆవకాయ ఎప్పుడు తిన్నానో గుర్తులేనట్లే' అని రాసుకున్నాను. విశ్వనాథ్ గారి సినిమా ఆయన పాటల ద్వారా అమ్మ వల్ల పరిచయమయింది. విశ్వనాథ్ గారు అనగానే కొన్ని శంకరాభరణం .. తదనంతర సినిమాలు ఎక్కువ తలుచుకుంటాం కానీ అంతకు ముందు ఆయన తీసిన సినిమాలు అమ్మ మాకు చెప్పడం వల్ల బాగా తెలుసు. ముఖ్యంగా 'ఉండమ్మా బొట్టు పెడతా' 'చెల్లెలి కాపురం' 'శారద' ... ఇలా. ఇంట్లో కర్ణాటక సంగీతం, సాహిత్యం .. ఈ వాతావరణం ఉన్నందువల్ల ఆయన సినిమాలు చిన్నప్పుడు పరిచయమయ్యాయి. పెద్దయ్యాక నేను సినిమా రంగం ఎంచుకోవడం వల్ల ఇంకొంత అనుబంధం పెరిగింది అని చెప్పవచ్చు. చిన్నప