చెత్త టాపిక్
నా బ్లాగ్ క్వాలిటీ ని శంకించకండి. అక్షరాలా చెత్త టాపిక్ ఇది .. చెత్త .. వేస్ట్ .. ట్రాష్ .. ఎన్ని మాటలు ఉపయోగించినా వాటిలో వ్యక్తమయ్యేది తీసిపారేసే, ఛీత్కార భావమే .. అదే చేస్తున్నాం కూడా .. మన జీవన శైలి వల్ల ఏ చెత్త ఎంత ఎలా పేరుకుపోయి అది ఎక్కడికి పోతోందో అని ఆలోచించట్లేదు. మన జీవన శైలే ఆలోచించనియ్యదు కూడా. మనం చాలా బిజీ. వేళాకోళంగా అనట్లేదు. నిజంగానే అంటున్నాను. మనకి చదువుకొనే అప్పుడు దీని గురించి అవగాహన కల్పించరు కదా. అది కూడా ఓ కారణం. హిందీ లో ఓ సామెత ఉంటుంది ... 'జబ్ జాగే వహీ సవేరా' (ఎప్పుడు మేల్కొంటే అప్పుడే తెల్లారినట్టు) అని. తెలుగు లో కూడా ఈ అర్ధం వచ్చే సామెత ఉండే ఉంటుంది.. ఇప్పుడు గుర్తు రావట్లేదు. (మీరు గుర్తు చేస్తే కృతజ్ఞురాలిని). అందుకే ఎప్పుడు మనకి తెలిస్తే అప్పుడే ఈ విషయం కొంచెం పట్టించుకోవడం మొదలుపెడితే మంచిదే. గిల్టీ ఫీలవ్వక్కర్లేదు. నగరం లో ఒక నలుగురు సభ్యులు ఉన్న సగటు కుటుంబం నుంచి ఎంత చెత్త వస్తుందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది మనకి తెలిసిందే. పాల ప్యాకెట్ల నుంచీ మొదలు. సరుకుల కవర్లు, పేపర్లు, షాంపూ బాటిల్స్, సోప్ బాక్సులు, టీవీ,