'కోట్ల' ఆస్తి
స్కూల్ లో కొటేషన్స్ సేకరించే అలవాటుండేది నాకు. ఎక్కడెక్కడ కనిపించినవి, వినిపించినవి ముందు రఫ్ గా రాసేసుకొని ఒక పుస్తకం లో తర్వాత నీట్ గా కాపీ చేసుకొనే దాన్ని. ఇంగ్లీష్ లిటరేచర్ చదవాలని కోరిక ఆ కోట్స్ వల్లే కలిగిందని చెప్పచ్చు. ఆ రచయితల చిన్న వాక్యాలే ఇంత బాగుంటే పూర్తి రచన ఇంకా ఎంత బాగుంటుందో అనే కుతూహలం తోనే ఎమ్మే ఇంగ్లీష్ చేసాన్నేను. ఇప్పటికీ కంటికి ఓ కొటేషన్ కనిపిస్తే, నాకు నచ్చితే ఏదో ఒక రకంగా రికార్డ్ చేసుకుంటాను ... ఇమేజ్ గానో, స్క్రీన్ షాట్ గానో.. ఏదో ఒక పుస్తకం లోనో. అక్షరం యొక్క విశ్వ రూపం ఈ కొటేషన్స్ లోనే కనిపిస్తుంది అనిపిస్తుంది నాకు. కేవలం కొన్ని పదాల లో ఒక మనిషిని ఉత్తేజపరచడమో, ధైర్యం చెప్పడమో, నవ్వించడమో, దిశా నిర్దేశం చేయడమో, దిగంతలకావల ఉన్న ప్రపంచాన్ని పరిచయం చేయడమో చేసేస్తాయి ఇవి. చరిత్ర లో కొంత మంది గొప్ప వాళ్ళు తమ అనుభవ సారాన్ని రంగరించి చెప్పిన పంచ్ డైలాగులే కదా కొటేషన్లంటే! నాకు కొటేషన్లు ఆసక్తి కరమైన థియరీలని, కొంత మంది మేధావులని, వారు ఆలోచించే తీరు తెన్నుల్ని పరిచయం చేశాయి. ఈ కొటేషన్స్ కాల్పనిక సాహిత్యం.. అంటే నవలలు, చిన్న కథల నుంచి తీసుకున్నవి కావు. ఆ