మార్పుమాలక్ష్మి
శ్రావణ మాసం వచ్చేసింది. అన్నీ ఆడాళ్ళ పండగలే. ఆడాళ్ళు బోల్డు బిజీ. చూడటానికి చాలా బాగుంటుంది. కొత్త చీరలు, పసుపు పాదాలు, తల్లో పూలు... కానీ ఆ కొత్త చీరలు చూసే వాళ్ళకి తెలీవు .. ఎన్ని డిస్కౌంట్లు ఉన్నా బడ్జెట్ లో మంచి చీర తెచ్చుకోవడానికి ఆ అతివ ఎంత కష్టపడిందో. పసుపు పాదాలు చూసే వారికి తెలీదు ... టెయిలర్ల చుట్టూ పీకో, ఫాల్, బ్లౌజ్ కోసం, శ్రావణ మంగళవారాల నోముల కోసం కాళ్లరిగేలా ఆ పడతి ఎలా తిరిగిందో. అసలే బిజీ గా ఉన్న ఆడవాళ్ళ కాలెండర్ లో శ్రావణ మాసం ఇంకో హడావుడికారి. working women అయినా, house wives అయినా ఈ మాసం చాలా stressful గా ఉంటుంది .. శుక్రవారమే ఇంటెడు పని, ఆరోజే రాని domestic help, పిండి వంటలు, మామూలు పనుల మీద ఈ తమలపాకులు, వక్కలు, పళ్ళు, పూల షాపింగ్, పేరంటాలకి, నోములకి ఎక్కే గడప, దిగే గడప .. పోనీ ఓపిక లేక ఏదైనా తక్కువ చేస్తే గిల్టీ ఫీలింగ్ .. అయినా ఇష్టం గా చేసేది కష్టంగా అనిపించదు అనుకోండి. పైగా ఈ నెల చేసుకొనే వ్రతాలు, పూజలు,నోములు అన్నీ వారి 'సౌభాగ్యం' ఉరఫ్ 'అత్తారింటి మేలు/భర్త ఆయురారోగ్య ఐశ్వర్యాలు/ముత్తయిదువతనం' మీద ఆధారపడి ఉన్నాయి మరి! అద