కొండలలో నెలకొన్న ..
ఒకే ఒక సారి ... రెండేళ్ల క్రితం ట్రెక్కింగ్ కి వెళ్లాను. ఓ ఆదివారం పొద్దున్న. ఖాజాగూడ హిల్స్ (హైదరాబాద్) లో. నాలుగు గంటల ట్రెక్. ఆరు... ఆరున్నర కి మొదలు పెడితే పది.. పదిన్నర కి పూర్తయింది. అప్పటికి కొన్ని నెలల నుంచి Hyderabad Trekking Club వారి సోషల్ మీడియా పేజెస్ ని తెగ ఫాలో అయిపోతున్నా నేను (ఇప్పటికీ!) నా లైఫ్ లో ఉన్న ఓ అసంతృప్తి ఏంటంటే నేను ఎక్కువ outdoor activities చేసే అవకాశం దొరకలేదు. స్కూల్ టైం తర్వాత రోడ్ల మీద పడి ఆడుకున్నది లేదు. (చాలా ఇష్టమైనా కూడా!) ప్రకృతి ని దగ్గరగా చూసింది అసలు లేదు.... సిటీ లోనే పెరగడం వల్ల. నాకు తెలిసిన ప్రకృతి మా పెరట్లో మందార మొక్క, కొన్ని పక్షులు (పేర్లు తెలియవు.. చెప్పాగా ప్రకృతి తో పరిచయం లేదని), ఇంటి ముందు చెట్టు మీద సీతాకోక చిలుకలు, వీధి లో కుక్కలు, పక్కింటి పిల్లి, మా ఇంటి మీద వాలే కాకి. 😒 పార్క్స్ ఉన్నాయి. కానీ మన సిటీ లో కొన్ని పార్కులే U certificate. మిగిలిన వాటిలో ప్రేమ పక్షులు, ఛిఛోరా గాళ్ళు. ఒక్కోసారి భలే suffocating గా అనిపిస్తుంది నాలుగు గోడల మధ్య. అలా అనిపించినప్పుడు ఈ Hyderabad Trekking Club ఫేస్బుక్ పేజీ