విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్.....
కాంప్లిమెంట్లు. ఈ టాపిక్ మీద నాకు చాలా అభిప్రాయాలు ఉన్నాయి. అవి ఇక్కడ ఒలకబోస్తున్నా ఈ రోజు. ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే కాంప్లిమెంట్ లా కనిపించేవన్నీ కాంప్లిమెంట్స్ కావు. ఇంగ్లీష్ లో compliment .... complement ఒకలాగే ఉంటాయి. ఒకే అక్షరం తేడా. ప్రశంస అనే అర్ధం వచ్చేది compliment. రెండో దానికి అర్ధం వేరు. Her dancing complemented his singing. ఆమె నాట్యానికి, అతని గానానికి జోడీ కుదిరింది. ఇలాంటి అర్ధం లో వాడతారు. కానీ స్పెల్లింగ్ రాసేటప్పుడు ఒక దాని బదులు ఇంకోటి రాసేస్తూ ఉంటారు. stationery ..stationary లాగా. ఆ రెండు పదాలకీ ఎంత తేడా ఉందో ... నిజం ప్రశంసలకి, ప్రశంస లా విన్పించే వాటికీ అంత తేడా ఉంది. "ఎంత సన్నబడ్డావు తెలుసా! ఒకప్పుడు ఎంత లావుగా అసహ్యంగా ఉండేదానివి! పెద్ద పొట్ట, టైర్లు... చేతులు కూడా ఇంత లావుగా ఉండేవి కదూ!" ఇది కాంప్లిమెంట్ కాదు. "నువ్వు కాఫీ చాలా బాగా చేస్తావు .. ఏదీ ఓ కప్పు ఇచ్చుకో" ఇది కూడా కాంప్లిమెంట్ కాదు . "వీళ్ళు ఇప్పుడు ఇలా ఉన్నారు కానీ ఒకప్పుడు వీళ్ళ ఇల్లు, బట్టలు ఎలా ఉండేవో తెలుసా?" అన్నారోసారి ఎవరో. అదేంటండి అలా అంటున్నారు అం