పోస్ట్!
ఒక కష్టం వచ్చింది. ఒక రోజు గడిచింది... రెండు రోజులు... వారం ... నెల .. గడిచిపోయాయి. పోవట్లేదు. ఇబ్బంది పెట్టేస్తోంది. మనకి తోచినవన్నీ చేసి చూసాం. అయినా లాభం లేదు. మొండిగా అలానే ఉంది. (లేదా ఇంకా పెరుగుతోంది) ఏం చేయాలి? ఒక సిద్ధాంతం ఉంది. (సిద్ధాంతం ఏంటో చెప్పే ముందు కొన్ని హెచ్చరికలు. మనలో ప్రతి ఒక్కరం మన జీవితానుభవాలు మలిచిన మూర్తులము. ఒకరి వ్యక్తిత్వం ఇంకొకరితో పోలదు. జీవితమంతా నిరర్థకమైన సంఘటనల సమాహారం, మనమే వ్యర్ధంగా దానిలో అర్ధం వెతుక్కుంటాం అని అనుకొనే వారికి ఈ సిద్ధాంతం నచ్చకపోవచ్చు. ఇంకా ఎన్నో మనస్తత్వాల కి ఇది సయించకపోవచ్చు. ఐ రెస్పెక్ట్ అండ్ అండర్స్టాండ్. నా పంథా ఏంటంటే, ఎప్పుడైనా ఓ సిద్ధాంతం ప్రతిపాదిస్తే దాన్ని వాడి చూడాలి. మనకి పనికొస్తేనే నమ్మాలి. లేకపోతే అది మన సిద్ధాంతం కాదన్నమాట. ఏం ఫర్వాలేదు .. ఈ ప్రపంచం లో శతకోటి కి అనంతకోటి.) మనని ఇబ్బంది పెడుతున్నది ఏదైనా .. బయట నుంచి వచ్చిన కష్టమైనా, ఓ వ్యక్తయినా, అనారోగ్యమైనా, ఆర్ధిక ఇబ్బందైనా, మన లో ఉన్న ఆంగ్జైటీ, డిప్రెషన్, అణుచుకోలేని కోరికలు, ఒకరి ని చూస్తే కలిగే అసూయ, ఏహ్య భావన, ... ఏవైనా ... అవి నాకు ఏం చెప్ప