Posts

Showing posts from September 16, 2018

గా .. మా .. నీ..

Image
సాగర సంగమం నేను చూసిన/చర్చించిన ప్రతి సందర్భానికి నాకు పది రూపాయలు ఎవరైనా ఇచ్చినట్టైతే ఈ పాటికి నేను కోటీశ్వరురాలిని అయిపోయేదాన్ని. అప్పుడు ఇదే బ్లాగ్ నేను కేరళ backwaters దగ్గర కూర్చొని రాసేదాన్ని. సాగర సంగమం గురించి సాగర సంగమం జరిగే చోట అన్నమాట!  కానీ నాకు ఆ పది రూపాయలు ఎవ్వరూ ఇవ్వలేదు. సినిమా మట్టుకు బోల్డు ఇచ్చింది. తెలుగు సంస్కృతికి కన్యాశుల్కం ఎలాంటిదో సాగర సంగమం అలాంటిది అని జెనెరలైజ్డ్ స్టేట్మెంట్స్ నేను ఇవ్వను. I can only say what it means to me. నేను దీన్ని మొదటి సారి ఎప్పుడు చూశానో గుర్తు లేదు....  ఆవకాయ మొదటి సారి ఎప్పుడు తిన్నానో గుర్తు లేనట్టే. కానీ ఇది జీవితం లో ఓ భాగం అయిపోయింది. ఇంటర్నెట్ వచ్చాక ఈ సినిమా మళ్ళీ ఒకటికి రెండు సార్లు చూసాను. చాలా సార్లు సినిమా మొత్తం కాకుండా కొన్ని కొన్ని సీన్లు చూడటం అలవాటు. ఓ కళాకారిణి గా చూసాను. నేను సినిమాల్లో పని చెయ్యడం మొదలు పెట్టాక ఓ టెక్నీషియన్ గా చూసాను. అన్ని సార్లు చివరి సీన్ దగ్గర గొంతు choke అయిపోతుంది. ప్రతి సారి అవ్వక్కర్లేదు అంటుంది ఇగో. ఎమోషన్ ఒప్పుకోదు. ఈ బాలు క్యారెక్టర్ మీద ఫస్ట్