Posts

Showing posts from August 10, 2025

హ్యాపీ బుక్ లవర్స్ డే!

Image
దేవుడు నాకు ఒకటి కాదు, రెండు సాధనాలు ఇచ్చాడు భావ వ్యక్తీకరణ కి. రచనా, సంగీతం. కథా, పాటా. ఉదయిని వారి పోటీ ప్రకటన చూడగానే నాకు కథా శిల్పం తో ఏదైనా కొత్త గా ప్రయత్నించాలి అనిపించింది. పాట స్ట్రక్చర్ అనుసరిస్తూ కథ రాస్తే ఎలా ఉంటుందనే ఆలోచన తో రాసినదే ‘ప్రియమైన ఆవార్ గీ’. రాస్తుండగా కథ కి, పాట కి అంత తేడా కనిపించలేదు నాకు. పాట కూడా కథలు చెప్పే సాధనమే. ఓ భావన ని ఎవోక్ చేసి కొన్ని నిముషాల పాటు అదే భావనలో ఉంచడమే పాట చేస్తుంది. కథ కూడా అంతే కదా. పాట కైతే సాకీ అంటాం… కథ కి ఉపోద్ఘాతం అంటాం. అక్కడ పంక్తులు, పేరాలు… ఇక్కడ పల్లవి, చరణాలు. ఓ దానికి ముగింపు ఇంకోదానికి ముక్తాయింపు. పాటకో ప్రేమ లేఖ రాయాలనే ఆలోచన కూడా ఎప్పటి నుంచో ఉండేది. మనందరికీ అలాంటి కొన్ని పాటలు ఉండే ఉంటాయి కదా. ఉర్దూ భాష లో బాధ కూడా అందంగా కనిపిస్తుంది. చరణాల ని తెలుగు లో రాసినప్పుడు నెర్వస్ ఫీల్ అయ్యాను. నిజానికి కొన్ని కథల్లో పరభాషా పదాలు/పంక్తులు తర్జుమా చెయ్యకుండా అలాగే వదిలేస్తారు… నాకెందుకో తెలుగు లో ఆ భావాల్ని అందుకొనే ప్రయత్నం చెయ్యాలి అనిపించింది. కథ రాసినన్ని రోజులూ పాట వింటూనే ఉన్నాను నేను. కథ లో రాసినట్టుగానే ఇంతకు ముం...