నోబెల్ సాధించాలంటే ఏం చెయ్యాలి?
చిన్నప్పుడు ఓ కార్టూన్ నాకు ఓ గొప్ప విషయాన్ని పరిచయం చేసింది. ఆ కార్టూన్ లో ఓ సైంటిస్ట్ కి బండ రాళ్ళు కొట్టే పని చెయ్యవలసి వస్తుంది. మిగిలిన వాళ్ళు రోజులు రోజులు ఒకే బండ రాయిని సుత్తులతో కొట్టి కొట్టి చిన్న చిన్న ముక్కలు చేస్తూ ఉంటారు. ఈ సైంటిస్ట్ మాత్రం ఆ బండ రాతిని అన్ని వైపులా గమనించి, తడిమి దాని సెంటర్ పాయింట్ ని కనుక్కొని దాని మీద సుత్తి తో చిన్నగా తడతాడు. అంతే. అంత పెద్ద బండ రాయి పొడి పొడి అయిపోతుంది! నన్ను ఈ కార్టూన్ చాలా ప్రభావితం చేసింది. ఒక పని ని నేను approach చేసే విధమే మార్చేసింది. నా అనుభవం ప్రకారం hard work is over-rated అండి. కష్టపడటాన్ని ఎందుకో అనవసరంగా glorify చేసేసారు. కష్టపడి చదువుకోవాలి. కష్టపడి ఇల్లు కట్టుకోవాలి. కష్టపడి పెళ్లి చేసుకొని కష్టపడి భరించి కష్టపడి షష్టి పూర్తి జరుపుకోవాలి. కష్టపడి పిల్లల్ని పెంచాలి. ఆ పిల్లలకి... కష్టపడి... వాళ్ళు కష్టపడే చదువులు చెప్పిస్తే అతి కష్టం మీద ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ కష్టపడి పెళ్లిళ్ళు చెయ్యాలి. ఎందుకండీ ఇంత కష్టం? అంటే చదువుకోవద్దా? ఉద్యోగాలు.. పెళ్లి ... పిల్లలు? కష్టపడద్దు అ