Posts

Showing posts from September 18, 2022

కవి హృదయం - 1

Image
 గిరీశం ఫక్కీ లో చెప్పాలంటే ఈ మధ్య పోయెట్రీ భలే చదివేస్తున్నానండోయ్!  ఇంగ్లీష్ పోయెట్రీ .  చిన్నప్పుడు పద్యాలంటే చాలా బోర్ ఫీల్ అయ్యేదాన్ని. ఎం ఏ ఇంగ్లీష్ చేసే అప్పుడు కూడా నవలలు ఇష్టంగా చదివే దాన్ని కానీ షేక్స్పియర్ పద్య నాటకాలు, కీట్స్  ... వీళ్ళ దగ్గరకి వచ్చేసరికి ముక్కున పట్టి ఏదో అయిందనిపించేసాను.  ఈ మధ్య ఇంస్టాగ్రామ్ లో పోయెట్రీ అకౌంట్స్ కనబడ్డాయి కొన్ని. కవి ఫోటో వేసి మరీ వారు రాసిన కొన్ని లైన్లు ఉంచుతారు పోస్టు లో.  ఏవో కొన్ని లైన్లు అనుకుంటాం కానీ ... అమ్మో! చాలా లోతుంది వాటిలో. అలాగే ప్రపంచాన్ని ఓ కవి ఎలా చూస్తాడో తెలుసుకోవచ్చు. భిన్న ఆలోచనా ధోరణులు తెలిసాయి కూడా నాకు. కొన్ని అయితే, భలే ఇలా కూడా ఆలోచించచ్చా అనిపించేలా ఉన్నాయి! నచ్చినవి, భలే అనిపించినవి సేవ్ చేసుకుంటాను ఇంస్టా లో. లేదంటే స్క్రీన్ షాట్ తీస్కొని పెట్టుకుంటాను.  మా అమ్మ గారు అన్నట్టు ఏదైనా మంచి చూస్తే అందరికీ చెప్పేయాలి అనే పిచ్చి ఉంది కాబట్టి, నేను చదివిన మంచి పోయెట్రీ లో కొన్ని మీకోసం ఈ రోజు. :)  రెండు తలల దూడ  లారా గిల్పిన్    ఈ కవిత లో శీర్షిక ఎంత ఆశ్చర్యకరంగా ఉందో, ఆఖరు లైన్ అంతే తమాషా గా ఉంది! ఆ ఆఖరు లైన్ న