Happy (Self) Teacher's Day!!!
నాకు చిన్నప్పుడు ఇంగ్లీష్ అంతగా రాదు. మా నాన్న గారు, మా తాతగారు, మా మావయ్య ఇంగ్లీష్ ఝాడించేసేవారు. వాళ్ళని అందరూ గొప్పగా చూసేవారు. మా నాన్నగారైతే ఇంగ్లీష్ లో crosswords, word puzzles ఈజీ గా పూర్తి చేసేస్తూ ఉంటారు. నాకు ఇదో super power లాగా అనిపించేది. ఇంగ్లీష్ బాగా నేర్చేసుకొని పేరు తెచ్చేసుకోవాలి అని నిర్ణయించేస్కున్నాను. నా 15th సంవత్సరం అప్పుడు మొదలు పెట్టాను .. ఇంగ్లీష్ నేర్చుకోవడం .. నా అంతట నేనే. రోజూ ఇంగ్లీష్ newspaper చదివేదాన్ని. ఎక్కడ కొత్త word కనిపించినా వెంటనే దాన్ని ఎలాగో అలాగా వాడెయ్యాలని చూసేదాన్ని. (ఒక్క సారి ఓ పదం వాడగానే నా vocabulary లో అది భాగం అయిపోతుంది అని అనుభవం మీద తెలుసుకున్నాను). Elocutions లో నా స్పీచ్ లు నేనే రాసుకొనే దాన్ని. వీలైనంత ఎక్కువ మాట్లాడేదాన్ని (ఇంగ్లీష్ లో 😁). నా school bag లో ఎప్పుడూ ఓ డిక్షనరీ ఉండేది. డాడ్ తో కలిసి word puzzles పూర్తి చెయ్యడం మొదలుపెట్టాను. ఇంగ్లీష్ newspapers కి ఆర్టికల్స్ రాసి పంపేదాన్ని. (ఒకసారి పబ్లిష్ అయ్యింది కూడా!) ఏదో ఒకటి రాస్తూ ఉండేదాన్ని ... నా డైరీ కూడా ఇంగ్లీష్ లో రాసేదాన్ని. కొన్నేళ్ళకి, ఒక డేట్ అని