"యాక్షన్ హీరో"
లేటెస్ట్ సినిమాలు చూసి రివ్యూ లు పెట్టడం అలవాటు లేదు నాకు. కానీ ' జయేష్ భాయ్ జోర్దార్' సినిమా గురించి తప్పకుండా రాయాలనిపించింది. దీని ట్రైలర్ చూసి థియేటర్ లో చూద్దామనుకున్నా. కుదర్లేదు. ఇంట్లో అమెజాన్ లో చూసాను. ఇది అంత హిట్ సినిమా కాదు ..... కానీ ఈ కాలానికి చాలా అవసరమైన సినిమా. ఎప్పుడూ పెద్ద ప్రొడక్షన్ హౌస్ లని విమర్శిస్తాం కదా .... మీరు కోట్లలో బిజినెస్ చేస్తారు .. పెద్ద స్టార్లందరూ మీ గుప్పెట్లో ఉంటారు .. మంచి సినిమా తీయచ్చు కదా అని. ఈ సినిమా అలంటి విమర్శల కి యష్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళ జవాబు అనిపిస్తుంది. (యష్ రాజ్ కి నాకూ ఏ సంబంధం లేదండి బాబు ... నిజంగా నచ్చే చెప్తున్నా). ఈ సినిమా హీరో రణ్వీర్ సింగ్. హీరోయిన్ అర్జున్ రెడ్డి లో హీరోయిన్ అయిన షాలినీ పాండే. రత్నా పాఠక్ షా, బోమన్ ఇరానీ ల తో పాటు కొత్త వాళ్ళు మంచి నటులు కనిపించారు ఇందులో. కథ ఏంటంటే బోమన్ ఇరానీ గుజరాత్ లో ఓ పల్లెటూరి సర్పంచ్. కరడు గట్టిన పురుషాహంకారం, లింగ వివక్ష, పితృస్వామ్యం లో ఉన్న చెత్త అంతా మూర్తీభవించిన వాడు. స్కూల్ ముందు మందు దుకాణం మూయించండి, తాగి ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నారు అంటే 'ఆడపిల్లలు వాసన