Posts

Showing posts from May 31, 2020

డూడ్లింగ్ అను పరధ్యాన చిత్రకళ

Image
చిన్నప్పుడు స్కూల్ లో నో, పెద్దయ్యాక ఆఫీసు మీటింగ్స్ లోనో, లేదా ఎవరితోనైనా ఫోన్ లో మాట్లాడుతూనో చేతి లో పెన్ను పేపర్ ఉంటే ఏవో గీతాలు గీసేస్తూ ఉంటాం చూడండి ...  ప్రతి చిన్న పని కి పేరు పెట్టేసే ఇంగ్లీష్ భాష లో దీని పేరు డూడ్లింగ్ ... (doodling). ఆ బొమ్మల్ని డూడుల్స్ (doodles) అంటారు.  పిచ్చి గీతల్లా అనిపించే ఈ డూడుల్స్ కి మనస్తత్వ శాస్త్రానికి, ధ్యానానికి.. ఇలా చాలా లోతైన సంబంధాలున్నాయట .. వాటితో ఈ రోజు మిమ్మల్ని విసిగిస్తానన్నమాట. 😁 ఎప్పుడైనా గమనించండి .. ఇలా గీసే గీతల్లో ఎవరి స్టైల్ వారిది ఉంటుంది .. మా అక్క ఎక్కువగా కళ్ళు వేస్తుంది .... ఇంద్రుడికి ఒళ్ళంతా కళ్ళు అన్నట్టు మా అక్క ఆలోచిస్తుంటే పేజీ అంతా కళ్ళే ఉంటాయి! (దాని అనుమతి లేకుండా రాసేస్తున్నాను ... ఏం జరుగుతుందో ఏవిటో!)  అలాగే కొంత మంది స్టిక్ ఫిగర్స్ .. అంటే ఓ నిలువు గీత .. దాని మీద గుండ్రంగా తల కాయ, ఆ గీత కి అటో రెండు ఇటో రెండు చేతులూ కాళ్ళలాగా గీస్తూ ఉంటారు. మా కజిన్ ఒకమ్మాయి పిచ్చి గీతాలు వెయ్యదు సరికదా ... కళాఖండాలే వేసేస్తూ ఉంటుంది.. ఆ డూడుల్స్ ఏ తాజ్ మహల్ మీదో చెక్కిన చిక్కటి డిజైన్ల లాగా ఉంటాయి .. చిక్కటి అంటే ..