Posts

Showing posts from March 22, 2020

రొటీన్ కి భిన్నం గా ...

Image
నేనేంటో సరదాగా సినిమా చూడలేను ...  ఏ స్టైల్ బట్టలు వేసుకోవాలో ముందే ఆలోచించుకొని అలాంటివి ఎక్కడ దొరుకుతాయో రీసెర్చ్ చేసి, వీలైతే  ట్రై చేసి, ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని, బడ్జెట్ కి కరెక్ట్ గా ఫిట్ అయ్యేవే ఎలా సెలెక్ట్ చేస్కుంటానో సినిమాల కి కూడా అంతే ప్రాసెస్ ఫాలో అవుతాను. (నోట్ టు సెల్ఫ్: నేను అసలు ఏ పనైనా సరదాగా, లైట్ గా చేస్తానా? ఆలోచించాలి.)  దీన్ని పర్ఫెక్షనిజం అనచ్చు, చాదస్తం అనచ్చు... కానీ నిజం ఏంటంటే నాకు నచ్చని సినిమాలు భరించే/సహించే శక్తి తక్కువ. కొంతమంది లైట్ గా ఏదైనా చూసి వచ్చెయ్యగలరు. ఇదో సూపర్ పవర్ నా ఉద్దేశం లో. నాకది లేదు కాబట్టి, ముందు ఆ సినిమా ట్రైలర్ చూసి, కథ తెలుసుకొని, ఇంటర్వ్యూలు చూసి, ఒక్కోసారి నేను ఎవరి అభిప్రాయాలని గౌరవిస్తానో వాళ్ళు కూడా స్టాంప్ వేసాక గానీ నేను ఓ సినిమా చూడను. ఈ లోగా కొత్త సినిమా అయితే థియేటర్ లోంచి వెళ్ళిపోతుంది అనే భయం అక్కర్లేదు .. ఇన్ని ఫిల్టర్ లు దాటిన సినిమా ఆడుతూ ఉంటుంది ఇంకా థియేటర్ల లో. అప్పుడు వెళ్లి చూస్తాను. పాత సినిమా అయితే అది వెబ్ ప్లాట్ఫారం లో వచ్చాక చూస్తూ ఉంటాను. ఇలా చూసిన సినిమాలన్నీ పూర్తిగా ఎంజాయ్ చేసాన్నేను. ఒ