Posts

Showing posts from December 30, 2018

దిల్ మే ఏక్ లెహెర్ సీ ఉఠీ హై అభీ...

Image
సముద్రమంటే ఇష్టమైన వారిలో నేనూ ఒకదాన్ని. మొదటి సారి వైజాగ్ లో ఉండే మావయ్య తీసుకెళ్లాడు... దూరం నుంచి 'అదిగో అదే సముద్రం' అన్నాడు.  నాకు ఆకాశం తప్ప యేమ్ కనబడదే! అప్పుడు మా మావయ్య  'ఆకాశం అని నువ్వు అనుకుంటున్న చోటు ని జాగ్రత్త గా గమనించు...ఓ సన్నటి లైన్ కింద నించి నీలం రంగు కొంచెం ముదురు గా కనిపించట్లేదు? అదే సముద్రం' అన్నాడు ... నేను థ్రిల్ల్ అయిపోయాను ....అప్పుడు ... I fell in love  పిల్లల తో ఎవరైనా అదే పని గా ఆడలేరు .... అలిసిపోతారు .... ఒక్క ప్రకృతే పిల్లలు అలిసిపోయే వరకూ ఎంటెర్టైన్ చెయ్యగలదు అనిపిస్తుంది! ఆ ఘోష .... ఎడతెరిపి లేని అలలు .... ఇసక... గవ్వలు ... ఆల్చిప్ప లు... వాటిలో ముత్యాలు ఉండచ్చేమో అనే వెర్రి ఆశ ... ఇష్టం లేకుండా ఉండేందుకు యేమీ లేదు సముద్రం లో  నాకు అలల తో కబడ్డీ ఆడటం ఇష్టం.... మొన్న  వచ్చిన ఓ హిందీ సినిమా లో ఈ సీన్ చూసి అందరికీ ఈ ఆట తెలుసన్నమాట అనుకున్నా ☺ ఇంత ఇష్టమైన సముద్రాన్ని ఎక్కువ సార్లు చూసే అవకాశం కలగలేదు నాకు. .. విధి చేసే వింత కాకపొతే భూమి మీద మూడొంతులు నిండిన సముద్రాన్ని చూడటం అంత కష్టమా?  ఆ విధే ఇంకో వింత చేసింది. ప