Posts

Showing posts from November 5, 2023

చూడాలని ఉంది

Image
పర్యాటకాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఎకో టూరిజం, హెరిటేజ్ టూరిజం ఇలా. నాకు సాంసృతిక  పర్యాటకం, ఆహార పర్యాటకం చాలా ఇష్టం.  ఈ పోస్టు ద్వారా దేవుడికో బహిరంగ లేఖ రాస్తున్నా అన్నమాట ..ఈ కోరికలు తీర్చమని!  ముందుగా సాహితీ-సాంస్కృతిక పర్యాటకం ...  కవులు, రచయితలు, గాయకులూ జీవించిన ఇళ్ళూ ఊళ్ళూ నన్ను చాలా ఆకర్షిస్తాయి.  మన తెలుగు రాష్ట్రాల తో మొదలు పెడితే ...  1. తాళ్ళపాక - అసలు అన్నమయ్య పుట్టిన ఊరు ఎలా ఉంటుంది ... ఆ గాలి, ఆ నీరు, ఆ మట్టి... అన్ని కీర్తనలు రాస్తే పర్యావరణమే మారిపోయి ఉంటుంది అని నాకనిపిస్తుంది. అన్నమయ్య కీర్తనలు పాడటం మూడో ఏటే మొదలుపెట్టినా ఆ ప్రదేశం మాత్రం ఇప్పటి వరకూ చూడలేదు.  2. భద్రాచలం, గోల్కొండ - ఇవి లక్కీ గా రెండూ చూసాను. గోల్కొండ కోట లో రామదాసు చెర, ఏ రంధ్రం ద్వారా ఆహరం పంపేవారో చూసాక "ఎవడబ్బ సొమ్మని" అని రాసేంత కోపం ఎందుకు వచ్చిందో అర్ధం అయ్యింది. అయినా రామభక్తి విడువని ఆయన అసిధారావ్రతానికి అబ్బురం అనిపించింది. భద్రాచలం ఈ మొత్తం అల్లరి కి కారణం అయిన నగలు చూడటం ఇంకో అనుభవం  3. రాజమండ్రి లో నేను బాల్యావస్థ లో ఉన్నప్పుడు ఓ నాలుగేళ్లు ఉన్నాం. నేను చదువుకున్నది శ్రీ కందు