Posts

Showing posts from June 4, 2023

మరపురాని పావుగంట

Image
ఏడేళ్ళ క్రితం ఇదే రోజున ప్రసాద్స్ ఐమాక్స్ లో మా షార్ట్ ఫిల్మ్ 'పెళ్ళివారమండి' ప్రదర్శించాం.  ఆ సినిమా నిడివి పావుగంట. అయినా దానితో ముడిపడిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. అవి గుర్తుచేసుకుంటూ ఈ పోస్టు.  నేను మొదట తీసిన షార్ట్ ఫిలిం 2007 లో. అప్పటికి యూట్యూబ్, షార్ట్ ఫిల్మ్స్ ... ఈ హవా ఇంకా మొదలవ్వనే లేదు. ఈ బుజ్జి సినిమా గురించి ఇంకో సారి చెప్తాను.  కట్ టు 2016.  ఓ ఫ్రెండ్ చాలా ఏళ్ళ తర్వాత కలిసి మేము సినిమాల్లో ఉన్నాం అని తెలిసి "మీరు ఎందుకు షార్ట్ ఫిలిం చెయ్యట్లేదు?" అని అడిగారు. "అబ్బా... ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ తీసేస్తున్నారు... ప్రొఫెషనల్స్ అయిన మేము కూడా ఈ మూస లో పడితే బాగోదేమో" అని  నసిగాను. కానీ ఆ ఫ్రెండ్ ఊరుకోలేదు. నేను డబ్బు పెడతాను, తియ్యమన్నారు. ఇంక నఖరాలు చెయ్యకుండా అక్కా, నేను పనిలోకి దిగాం.  నిజానికి ఇది ఓ డ్రీం ప్రాజెక్ట్ అయింది. ఎలా అంటే, డబ్బు పెట్టిన వ్యక్తి ఎవరైనా కథలో వేలు పెడతారు కానీ మా ఫ్రెండ్ అస్సలు ఏమీ పట్టించుకోలేదు. నేను తక్కువలో తీద్దాం అనుకున్నాను. కానీ కథ రెడీ అయ్యాక నిడివి, అది బాగా వచ్చిందనిపించి మూడు రెట్లు బడ్జెట్ పెంచ