మూడు పాటల కథ
అనగనగా నేను. ఘజళ్ళ పిచ్చి దాన్ని. నాకు జరిగిన కథే ఇది. ఎన్నో మలుపులు, మిస్టరీ, నవలల్లో లాగా సంఘటనలు వెంటవెంటనే అవ్వకుండా ... మధ్యలో కొన్ని సంవత్సరాల గాప్ .... ఊహాతీతంగా, థ్రిల్ కలిగించిన కథ ఇది. పైన వర్ణించిన అనుభూతులన్నీ మీకు కూడా కలగుతాయి ఈ కథ మీరు చదివితే. మీరు సంగీత ప్రియులవ్వాలి అంతే. కథా క్రమం లో ముందుగా 2007-2008 ప్రాంతం ... మా అక్క సుష్మ వరల్డ్ స్పేస్ రేడియో లో రేడియో జాకీ, ప్రోగ్రాం డైరెక్టర్ (అసిస్టెంట్) గా చేస్తూ ఉండేది. లలిత సంగీత సామ్రాట్ చిత్తరంజన్ గారు ఆ రేడియో కి ఓ సంగీత పరమైన షో చేసేవారు. నేను అక్కడ పని చెయ్యకపోయినా మా అక్క ని పికప్ చేసుకోడానికి వెళ్లేదాన్ని. రచయిత్రి మృణాళిని గారు అప్పుడు అక్కడ ప్రోగ్రాం డైరెక్టర్. మా మధ్య చాలా సాహితీ, సంగీత చర్చలు జరుగుతూ ఉండేవి. ఒక సారి నేను వెళ్ళినప్పుడు చిత్తరంజన్ గారు వచ్చి ఉన్నారు. ఆయన ఓ తెలుగు సినిమా పాట కి ఒరిజినల్ ఓ ఘజల్ అని ... ఆ ఘజల్ గుర్తు రావట్లేదు అని అన్నారు. నా ఘజళ్ళ పిచ్చి తెలిసిన మృణాళిని గారు ... ఇదిగో ఈ అమ్మాయి ని అడుగుదాం అన్నారు. ఆయన తెలుగు పాట పాడారు. అది చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఫేవరేట్ పాట! మా అమ్