సారీ చెప్పేద్దాం...
కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవి మనం జీవితం లో ఎప్పుడూ చేయలేకపోయినా. విదేశాల్లో రోజు కి కొన్ని వేల డాలర్లు ఖర్చయ్యే లగ్జరీ హోటల్ రూమ్ లో ఉండలేం అని తెలుసు ... కాని ఆ రూమ్ ఫోటోలు చూస్తాం కదా ... అలా అన్నమాట. అంతే అ/సాధ్యమయిన విషయం .... సరిగ్గా 'సారీ' చెప్పడం. అసాధ్యం ఎందుకంటే ఈ ఈగో మనదే తప్పు అని ఒప్పుకోనివ్వదు ముందు. ఏదో తప్పు చేసాం .. అందరూ చెయ్యట్లేదా ... నా కంటే ఫలానా వ్యక్తి ఎంత పెద్ద తప్పు చేసాడో తెలుసా ... వాడెప్పుడైనా సారీ చెప్పగా విన్నావా? అయినా ఇప్పుడు సారీ చెప్తే తప్పొప్పుకున్నట్టే కదూ ... చులకన అయిపోమూ ఎదుటి వ్యక్తి ముందు? రిలేషన్షిప్ లో మన పవర్ తగ్గిపోదూ? అయినా ఈ తప్పు తన తప్పు కి నా జవాబు .. కాబట్టి సరి కి సరి. అసలు అయినా ఆ వ్యక్తి నేను చేసిన దానికి అలా రెస్పాండ్ అయితే ... తప్పు నాది కాదు వాళ్ళది ... ఇలాంటివి భార్యాభర్తల మధ్య/స్నేహితుల మధ్య/ఆఫీసు లో పని చేసే వాళ్ళ మధ్య/చుట్టాల్లో/పాలిటిక్స్ లో/బిజినెస్ లో /ప్రొఫెషన్ లో /ఏదో ఒక బంధం ఉన్నవారి తో మామూలే ... ఇంతోటి దానికి సారీ చెప్పక్కర్లేదు పిల్లలకి సారీ చెప్పడం ఏమిటి? వాళ్లకేం తెలుసు? నేను