కుళ్ళుమోతు మల్లిమీతు
ఈ సబ్జెక్టు తో నాకు చాలా అనుభవం ఉందండోయ్. అంటే నాకు కుళ్ళుకోవడం అలవాటు అని కాదు నేను చాలా భరించాను అని అర్ధం. అందరూ కొట్టి పడేస్తారు .. ఆ .. అందరికీ కలిగేదే అని. కానీ దీని వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ కుళ్ళు మన దగ్గర బంధాల్లోకి ప్రవేశిస్తే ఆ స్ట్రెస్ వేరు కదా. నేను బలంగా నమ్మే విషయాల్లో ఒకటి ... లాజిక్ కాదు మనస్థితే మనిషి మనుగడ ని శాసిస్తుంది. లాజిక్ ని నమ్మే జాతి అయితే మనం యుద్ధం, క్షామం, ఆకలి లేకుండా చేసుకొనేవాళ్ళం. ఉండాల్సిన ఒకే భూమి ని సరిగ్గా చూసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు స్థితి ని చూసి ఏం చేస్తే ఇలా ఉన్నాం అని వెనక్కి calculate చేసుకుంటే తెలుస్తుంది.. పాలకుల, ధనికుల మనోవికారాల ఫలితమే ఈరోజు మన ప్రపంచం. అందులో అసూయ ఒక పెద్ద స్థానాన్ని ఆక్రమించుకుంది. కుళ్ళు అనే ప్రాసెస్ ని విశదీకరిస్తే దాని మూలం పోల్చుకోవడం లో ఉంది. నువ్వు నీలా బ్రతికేస్తున్నావు .. ఏదో లాగా. ఈ లోపు ఓ చుట్టమో, ఫ్రెండో కనిపిస్తాడు.. లేదా ఏదో వార్త వస్తుంది వాళ్ళ గురించి. అంతే మొదలవుతుంది కుళ్ళు. ఈ మొదలైన జెలసీ ఒక మోతాదు లో చాలా కామన్. దీని వల్ల పెద్ద నష్టం లేదు కూడా. కానీ మోతాదు మించితేనే ఇబ్బంది..ఆ కుళ్ళు కలిగ