Posts

Showing posts from 2023

చూడాలని ఉంది

Image
పర్యాటకాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఎకో టూరిజం, హెరిటేజ్ టూరిజం ఇలా. నాకు సాంసృతిక  పర్యాటకం, ఆహార పర్యాటకం చాలా ఇష్టం.  ఈ పోస్టు ద్వారా దేవుడికో బహిరంగ లేఖ రాస్తున్నా అన్నమాట ..ఈ కోరికలు తీర్చమని!  ముందుగా సాహితీ-సాంస్కృతిక పర్యాటకం ...  కవులు, రచయితలు, గాయకులూ జీవించిన ఇళ్ళూ ఊళ్ళూ నన్ను చాలా ఆకర్షిస్తాయి.  మన తెలుగు రాష్ట్రాల తో మొదలు పెడితే ...  1. తాళ్ళపాక - అసలు అన్నమయ్య పుట్టిన ఊరు ఎలా ఉంటుంది ... ఆ గాలి, ఆ నీరు, ఆ మట్టి... అన్ని కీర్తనలు రాస్తే పర్యావరణమే మారిపోయి ఉంటుంది అని నాకనిపిస్తుంది. అన్నమయ్య కీర్తనలు పాడటం మూడో ఏటే మొదలుపెట్టినా ఆ ప్రదేశం మాత్రం ఇప్పటి వరకూ చూడలేదు.  2. భద్రాచలం, గోల్కొండ - ఇవి లక్కీ గా రెండూ చూసాను. గోల్కొండ కోట లో రామదాసు చెర, ఏ రంధ్రం ద్వారా ఆహరం పంపేవారో చూసాక "ఎవడబ్బ సొమ్మని" అని రాసేంత కోపం ఎందుకు వచ్చిందో అర్ధం అయ్యింది. అయినా రామభక్తి విడువని ఆయన అసిధారావ్రతానికి అబ్బురం అనిపించింది. భద్రాచలం ఈ మొత్తం అల్లరి కి కారణం అయిన నగలు చూడటం ఇంకో అనుభవం  3. రాజమండ్రి లో నేను బాల్యావస్థ లో ఉన్నప్పుడు ఓ నాలుగేళ్లు ఉన్నాం. నేను చదువుకున్నది శ్రీ కందు

విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్.....

కాంప్లిమెంట్లు. ఈ టాపిక్ మీద నాకు చాలా అభిప్రాయాలు ఉన్నాయి. అవి ఇక్కడ ఒలకబోస్తున్నా ఈ రోజు.  ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే కాంప్లిమెంట్ లా కనిపించేవన్నీ కాంప్లిమెంట్స్ కావు.  ఇంగ్లీష్ లో compliment .... complement ఒకలాగే ఉంటాయి. ఒకే అక్షరం తేడా. ప్రశంస అనే అర్ధం వచ్చేది compliment. రెండో దానికి అర్ధం వేరు. Her dancing complemented his singing. ఆమె నాట్యానికి, అతని గానానికి జోడీ కుదిరింది. ఇలాంటి అర్ధం లో వాడతారు. కానీ స్పెల్లింగ్ రాసేటప్పుడు ఒక దాని బదులు ఇంకోటి రాసేస్తూ ఉంటారు. stationery ..stationary లాగా.  ఆ రెండు పదాలకీ ఎంత తేడా ఉందో ... నిజం ప్రశంసలకి, ప్రశంస లా విన్పించే వాటికీ అంత తేడా ఉంది.  "ఎంత సన్నబడ్డావు తెలుసా! ఒకప్పుడు ఎంత లావుగా అసహ్యంగా ఉండేదానివి! పెద్ద పొట్ట, టైర్లు... చేతులు కూడా ఇంత లావుగా ఉండేవి కదూ!" ఇది కాంప్లిమెంట్ కాదు.   "నువ్వు కాఫీ చాలా బాగా చేస్తావు .. ఏదీ ఓ కప్పు ఇచ్చుకో" ఇది కూడా కాంప్లిమెంట్ కాదు .  "వీళ్ళు ఇప్పుడు ఇలా ఉన్నారు కానీ ఒకప్పుడు వీళ్ళ ఇల్లు, బట్టలు ఎలా ఉండేవో తెలుసా?" అన్నారోసారి ఎవరో. అదేంటండి అలా అంటున్నారు అం

కుళ్ళుమోతు మల్లిమీతు

ఈ సబ్జెక్టు తో నాకు చాలా అనుభవం ఉందండోయ్. అంటే నాకు కుళ్ళుకోవడం అలవాటు అని కాదు నేను చాలా భరించాను అని అర్ధం. అందరూ కొట్టి పడేస్తారు .. ఆ .. అందరికీ కలిగేదే అని. కానీ దీని వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ కుళ్ళు మన దగ్గర బంధాల్లోకి ప్రవేశిస్తే ఆ స్ట్రెస్ వేరు కదా.  నేను బలంగా నమ్మే విషయాల్లో ఒకటి ... లాజిక్ కాదు మనస్థితే మనిషి మనుగడ ని శాసిస్తుంది. లాజిక్ ని నమ్మే జాతి అయితే మనం యుద్ధం, క్షామం, ఆకలి లేకుండా చేసుకొనేవాళ్ళం. ఉండాల్సిన ఒకే భూమి ని సరిగ్గా చూసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు స్థితి ని చూసి ఏం చేస్తే ఇలా ఉన్నాం అని వెనక్కి calculate చేసుకుంటే తెలుస్తుంది.. పాలకుల, ధనికుల మనోవికారాల ఫలితమే ఈరోజు మన ప్రపంచం. అందులో అసూయ ఒక పెద్ద స్థానాన్ని ఆక్రమించుకుంది. కుళ్ళు అనే ప్రాసెస్ ని విశదీకరిస్తే దాని మూలం పోల్చుకోవడం లో ఉంది. నువ్వు నీలా బ్రతికేస్తున్నావు .. ఏదో లాగా. ఈ లోపు ఓ చుట్టమో, ఫ్రెండో కనిపిస్తాడు.. లేదా ఏదో వార్త వస్తుంది వాళ్ళ గురించి. అంతే మొదలవుతుంది కుళ్ళు. ఈ మొదలైన జెలసీ ఒక మోతాదు లో చాలా కామన్. దీని వల్ల పెద్ద నష్టం లేదు కూడా. కానీ మోతాదు మించితేనే ఇబ్బంది..ఆ కుళ్ళు కలిగ

మరపురాని పావుగంట

Image
ఏడేళ్ళ క్రితం ఇదే రోజున ప్రసాద్స్ ఐమాక్స్ లో మా షార్ట్ ఫిల్మ్ 'పెళ్ళివారమండి' ప్రదర్శించాం.  ఆ సినిమా నిడివి పావుగంట. అయినా దానితో ముడిపడిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. అవి గుర్తుచేసుకుంటూ ఈ పోస్టు.  నేను మొదట తీసిన షార్ట్ ఫిలిం 2007 లో. అప్పటికి యూట్యూబ్, షార్ట్ ఫిల్మ్స్ ... ఈ హవా ఇంకా మొదలవ్వనే లేదు. ఈ బుజ్జి సినిమా గురించి ఇంకో సారి చెప్తాను.  కట్ టు 2016.  ఓ ఫ్రెండ్ చాలా ఏళ్ళ తర్వాత కలిసి మేము సినిమాల్లో ఉన్నాం అని తెలిసి "మీరు ఎందుకు షార్ట్ ఫిలిం చెయ్యట్లేదు?" అని అడిగారు. "అబ్బా... ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ తీసేస్తున్నారు... ప్రొఫెషనల్స్ అయిన మేము కూడా ఈ మూస లో పడితే బాగోదేమో" అని  నసిగాను. కానీ ఆ ఫ్రెండ్ ఊరుకోలేదు. నేను డబ్బు పెడతాను, తియ్యమన్నారు. ఇంక నఖరాలు చెయ్యకుండా అక్కా, నేను పనిలోకి దిగాం.  నిజానికి ఇది ఓ డ్రీం ప్రాజెక్ట్ అయింది. ఎలా అంటే, డబ్బు పెట్టిన వ్యక్తి ఎవరైనా కథలో వేలు పెడతారు కానీ మా ఫ్రెండ్ అస్సలు ఏమీ పట్టించుకోలేదు. నేను తక్కువలో తీద్దాం అనుకున్నాను. కానీ కథ రెడీ అయ్యాక నిడివి, అది బాగా వచ్చిందనిపించి మూడు రెట్లు బడ్జెట్ పెంచ

ఇల్లలికి ఇల్లలికి .. ముగ్గేసి ముగ్గేసి ..

నాకు ఇంటి పని తో చాలా పేచీలున్నాయి.  ఒకటి ఆ పని కి ఉన్న రిపిటీటివ్ నేచర్. ఒక్క రోజు, ఒక్క సారి చేస్తే సరిపోదు. చేస్తూనే ఉండాలి. చేస్తే మామూలుగా ఉంటుంది కానీ చెయ్యకపోతే కనిపిస్తుంది ఏవిటో. ఇంటి శుభ్రానికి శత్రుత్రయం ... దుమ్ము, చెత్త, మట్టి. అందులో దుమ్ము రక్తబీజుడి జాతికి చెందినదే అనిపిస్తుంది నాకు. టెడ్డీ బేర్, బార్బీ బొమ్మలు ఇష్టంగా కొనుక్కొని ఈ రాక్షసుడికి భయపడే వాటికి ప్లాస్టిక్ కవర్ ముసుగులు వేసేస్తూ ఉంటాం కదా. ఈ దుమ్ము అటక ల మీదా, ఫాన్ల మీద ఓ రకంగా, నేల మీద ఇంకో రకంగా, ఎలక్ట్రానిక్స్ మీద మరో రకంగా ఏర్పడుతూ ఉంటుంది. ఒకదానికి ఉపయోగించిన ఆయుధం ఇంకో దానికి ఉపయోగించలేం. అమెజాన్ లో కి వెళ్తే దోమల మెష్ తుడవడానికి ఓ బ్రష్, కార్పెట్ తుడవడానికి ఇంకోటి ఇలా అమ్ముతాడు. కానీ మనం ఆ ట్రాప్ లో పడకూడదు. మా  నాన్నగారు పాత దిండు గలీబు తో ఫాన్ తుడిచే వారు. ఇవి ఇండియా లో మనకే సాధ్యమైన జుగాడ్ చిట్కాలు.  కొంతలో కొంత చెత్త ఫర్వాలేదు. ఇంట్లో ఫంక్షన్ లాంటివి పెట్టుకున్నప్పుడే ఎక్కువ వస్తుంది. లేకపోతే మామూలే. ఇంక మట్టి ...  పిల్లలు, మొక్కలు, పెంపుడు జంతువులు ఉన్నప్పుడూ, వానాకాలం లోనూ వస్తుంది అనుకోవచ్చు. ఇవ

"పెంపకాలు" (ఈనాడు ఆదివారం లో నా కథ)

Image
మొత్తానికి ఇంకో కథ రాసానండి. ఈనాడు ఆదివారం సంచిక వారు ప్రచురించినందుకు కృతజ్ఞతలు. ఇదిగో, ఇక్కడ షేర్ చేస్తున్నా.  

విశ్వనాథ్ గారికి స్మృత్యంజలి

Image
విశ్వనాథ్ గారి తో నాకు కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి అని చెప్పుకోవడం ఓ అదృష్టం గా భావిస్తున్నాను.  తెలుగు వారి గా పుట్టి విశ్వనాథ్ గారి గొప్పతనం తెలియకపోవడం అసంభవం. మన ఇళ్లలో పిల్లలకి పరిచయం చేసే తెలుగు సంస్కృతి లో ఆయన సినిమాలు, పాటలు, సన్నివేశాలు  ఎప్పుడో ఓ భాగమైపోయాయి.  నా పోస్టు  గా .. మా .. నీ..  లో విశ్వనాథ్ గారు సృష్టించిన సాగర సంగమం లో 'బాలు' పాత్ర గురించి రాసే అప్పుడు 'మొదటి సారి సాగర సంగమం ఎప్పుడు చూశానో  గుర్తులేదు ... .. మొదటి ఆవకాయ ఎప్పుడు తిన్నానో గుర్తులేనట్లే' అని రాసుకున్నాను.  విశ్వనాథ్ గారి సినిమా ఆయన పాటల ద్వారా అమ్మ వల్ల పరిచయమయింది.  విశ్వనాథ్ గారు అనగానే కొన్ని శంకరాభరణం .. తదనంతర సినిమాలు ఎక్కువ తలుచుకుంటాం కానీ అంతకు ముందు ఆయన తీసిన సినిమాలు అమ్మ మాకు చెప్పడం వల్ల బాగా తెలుసు. ముఖ్యంగా 'ఉండమ్మా బొట్టు పెడతా' 'చెల్లెలి కాపురం' 'శారద' ... ఇలా.  ఇంట్లో కర్ణాటక సంగీతం, సాహిత్యం .. ఈ వాతావరణం ఉన్నందువల్ల ఆయన సినిమాలు చిన్నప్పుడు  పరిచయమయ్యాయి. పెద్దయ్యాక నేను సినిమా రంగం ఎంచుకోవడం వల్ల ఇంకొంత అనుబంధం పెరిగింది అని చెప్పవచ్చు. చిన్నప

నేను పాడిన ఓ ఘజల్

Image
నా బ్లాగు బాంధవులకి నా ఘజళ్ళ ప్రేమ తెలీనది కాదు.  ఘజల్స్ కి సంబంధించి ఇంతకు ముందు ఓ రెండు మూడు పోస్ట్స్ రాసాను.    నేను రాసిన ఓ ఉర్దూ ఘజల్  ,  ఆజ్ .. కుఛ్ టూటీ ఫూటీ సీ హూ మేఁ  ,  అలాగే ఘజల్స్ నుంచి వచ్చిన ఓ తెలుగు సినిమా పాట ని విశ్లేషించిన మూడు పాటల కథ   ఇవి తెలిసే ఉంటాయి.   దూరదర్శన్ లో నా చిన్నప్పుడు పీనాజ్ మసానీ అనే గొప్ప గాయనీమణి పాడిన ఓ ఘజల్ ప్రసారం చేశారు. అప్పట్నుంచి అది నాకు గుర్తుండిపోయింది. పెద్దయ్యాక గూగుల్ లో వెతికితే అప్పుడు గూగుల్ లో కనపడలేదు. కానీ ఓ రెండేళ్ల క్రితం అనుకుంటా ఇంటర్నెట్ లో ఆ ఘజల్ కనిపించింది.  లూప్ లో కొన్ని గంటలు వింటూ ఉండిపోయాను ఆ ఘజల్.  యూ ఉన్ కీ బజ్మ్ మే ఖామోషియో నే కామ్ కియా  సబ్ హీ నే మేరీ మొహబ్బత్ కా ఏతరాం కియా ..  ఇలా సాగుతుంది ఆ ఘజల్.  మొన్న ఓ సారి వీలు దొరికినపుడు పాడి రికార్డ్ చేసాను. అదే మా సాపాసా యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసాం ఈ రోజు.  ఆ వీడియో లోనే ఘజల్ అర్ధం కూడా ఉంటుంది.  ఘజల్ లో నాలుగు చరణాలు ఉంటాయి  నేను రెండు మాత్రం పాడాను. మొదటిది, ఆఖరిది.  ఈ ఘజల్ లో నాకు నచ్చిన ఓ అంశం ... ఏ లింగం వారైనా పాడుకోగలగడం. రాతి గుండె ప్రేయసే కాదు రాతి గుండ

చదువులలో మర్మమెల్ల ...

చాలా రోజుల నుంచి చదువులు, విద్యా వ్యవస్థ మీద నా ఆలోచనలు, అనుభవం షేర్ చేసుకుందామనుకుంటున్న.  విద్యా వ్యవస్థ అంటే అందులో సిలబస్, బడి గంటలు, బడి పరిస్థితులు, ఫీజులు, భారత దేశం లో తల్లి దండ్రుల సైకాలజీ, పరీక్షా పద్ధతులు... ఇలా చాలా అంశాలు ఉన్నాయి. కానీ ఈ రోజు నా ఫోకస్ సిలబస్, బోధన లో నాకు నచ్చని పోకడలు ..... వీటి గురించే ఉంటుంది.  చాలా విషయాల్లో లాగా ఈ సబ్జెక్టు కూడా బ్రిటిషు వాళ్ళు రాక ముందు, వచ్చాక .. ఇలా ఆలోచించాల్సి ఉంటుంది.  గురుకుల విద్య మన సంప్రదాయం. తర్వాత స్కూళ్ళు మొదలయ్యాయి. అప్పుడొక మంచి, ఇప్పుడొక మంచి. అప్పుడు గురుకులాలు కొన్ని కులాలకు అందుబాటులో లేక పోయేవి. ఇప్పుడు స్కూళ్ళు అందరివీనూ.  వృత్తి విద్యలు ఉండేవి. కానీ ఇవి కూడా ఆ వృత్తి కి చెందిన సామాజిక వర్గం వారే నేర్చుకుని సాధన చెయ్యాలనే నియమం ఉండేది.  ఇవి అంతా మన విద్య ఆంగ్లీకరించక ముందు.   బ్రిటిష్ వాళ్ళకి క్లర్కులే కావాలి కాబట్టి మన విద్యా వ్యవస్థ కూడా అలాగే డిజైన్ చేయబడింది అని తెలిసిన విషయమే. ఆ తర్వాత ఏమీ మార్పు రాలేదా అంటే కొంత వచ్చిందని నాకు అనిపిస్తుంది.  కానీ విద్యా నాణ్యత గురించి మాట్లాడితే నాకు కొన్ని సందేహాలు, పరిశీలన

ట్రిబ్యూట్ టు అవర్ డాడ్

Image
డిసెంబర్ పదిహేనో తారీఖున మా నాన్న గారు వెళ్లిపోయారు.  గత కొన్ని మాసాలుగా అస్వస్థులుగా ఉన్నారు.  ఇక్కడి నా కమ్యూనిటీ కి ఈ విషయం షేర్ చేస్కోవాలనిపించి రాస్తున్నాను.  మా నాన్న గారికి ఓ చిన్న ట్రిబ్యూట్ ని మా 'సా పా సా' ఛానెల్ లో అప్లోడ్ చేసాం. అదే ఇక్కడ కూడా పోస్టు చేస్తున్నాను.  మా నాన్న గారి కి మెలోడ్రామా అస్సలు ఇష్టం ఉండదు... ఉండేది కాదు (నాన్న గారి విషయం లో past tense వాడటం ఇప్పుడిప్పుడే అలవాటవుతోంది). ఎంత పెద్ద కష్టమైనా మూవ్ ఆన్ అయిపోవడమే కరెక్ట్ అనేవారు. ఆ స్ఫూర్తి తోనే మళ్ళీ రొటీన్ లో పడటానికి ప్రయత్నిస్తున్నాం మేము.  నా ప్రతి బ్లాగ్ పోస్టు చదివేవారు డాడ్.  కవి హృదయం   పోస్టు లో రెండు తలల దూడ కవిత కి ఆయన వాట్సాప్ లో నాకు కామెంట్ పంపించారు. ఆ దూడని బతికుండగా చూడలేని లోకం museum లో పెడితే మాత్రం చూడటానికి వెళ్తుంది మరి ... అని అన్నారు. నాకు నిజమే కదా అనిపించింది.  ఆఖరి పోస్టు ఆయన పోయిన రోజు రాసాను  .. కొన్ని గంటల ముందు. అదొక్కటే చదవలేకపోయారు.  వచ్చే పోస్టు త్వరలో రాస్తాను. నార్మల్సి కి మళ్ళీ వచ్చినట్టు అనిపిస్తుంది అప్పుడు.