నేను పాడిన ఓ ఘజల్

నా బ్లాగు బాంధవులకి నా ఘజళ్ళ ప్రేమ తెలీనది కాదు. 
ఘజల్స్ కి సంబంధించి ఇంతకు ముందు ఓ రెండు మూడు పోస్ట్స్ రాసాను. 
 
నేను రాసిన ఓ ఉర్దూ ఘజల్ , 
ఆజ్ .. కుఛ్ టూటీ ఫూటీ సీ హూ మేఁ , 
అలాగే ఘజల్స్ నుంచి వచ్చిన ఓ తెలుగు సినిమా పాట ని విశ్లేషించిన మూడు పాటల కథ ఇవి తెలిసే ఉంటాయి. 


దూరదర్శన్ లో నా చిన్నప్పుడు పీనాజ్ మసానీ అనే గొప్ప గాయనీమణి పాడిన ఓ ఘజల్ ప్రసారం చేశారు. అప్పట్నుంచి అది నాకు గుర్తుండిపోయింది. పెద్దయ్యాక గూగుల్ లో వెతికితే అప్పుడు గూగుల్ లో కనపడలేదు. కానీ ఓ రెండేళ్ల క్రితం అనుకుంటా ఇంటర్నెట్ లో ఆ ఘజల్ కనిపించింది. 


లూప్ లో కొన్ని గంటలు వింటూ ఉండిపోయాను ఆ ఘజల్. 

యూ ఉన్ కీ బజ్మ్ మే ఖామోషియో నే కామ్ కియా 
సబ్ హీ నే మేరీ మొహబ్బత్ కా ఏతరాం కియా .. 
ఇలా సాగుతుంది ఆ ఘజల్. 

మొన్న ఓ సారి వీలు దొరికినపుడు పాడి రికార్డ్ చేసాను. అదే మా సాపాసా యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసాం ఈ రోజు. 
ఆ వీడియో లోనే ఘజల్ అర్ధం కూడా ఉంటుంది. 

ఘజల్ లో నాలుగు చరణాలు ఉంటాయి 
నేను రెండు మాత్రం పాడాను. మొదటిది, ఆఖరిది. 

ఈ ఘజల్ లో నాకు నచ్చిన ఓ అంశం ... ఏ లింగం వారైనా పాడుకోగలగడం. రాతి గుండె ప్రేయసే కాదు రాతి గుండె ప్రేమికుడి బారిన పడిన అమ్మాయిలు కూడా పాడుకోవచ్చు. ఘజల్స్ లో ఇది అరుదు. 

ఇంకో అంశం .. ట్యూన్. పాడటానికి కొంత ఛాలెంజింగ్ గా ఉంటుంది.. మంచి గమకాల తో. మీరు ఒరిజినల్ గూగుల్ చేసి తప్పకుండా వినండి. (Yun Unki Bazm Main  - Penaz Masani) అందులో చరణాల మధ్య సంగీతం కూడా చాలా బాగుంటుంది. 



Comments