సారీ చెప్పేద్దాం...
కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
అవి మనం జీవితం లో ఎప్పుడూ చేయలేకపోయినా.
విదేశాల్లో రోజు కి కొన్ని వేల డాలర్లు ఖర్చయ్యే లగ్జరీ హోటల్ రూమ్ లో ఉండలేం అని తెలుసు ... కాని ఆ రూమ్ ఫోటోలు చూస్తాం కదా ... అలా అన్నమాట.
అంతే అ/సాధ్యమయిన విషయం .... సరిగ్గా 'సారీ' చెప్పడం.
అసాధ్యం ఎందుకంటే ఈ ఈగో మనదే తప్పు అని ఒప్పుకోనివ్వదు ముందు.
ఏదో తప్పు చేసాం .. అందరూ చెయ్యట్లేదా ...
నా కంటే ఫలానా వ్యక్తి ఎంత పెద్ద తప్పు చేసాడో తెలుసా ... వాడెప్పుడైనా సారీ చెప్పగా విన్నావా?
అయినా ఇప్పుడు సారీ చెప్తే తప్పొప్పుకున్నట్టే కదూ ... చులకన అయిపోమూ ఎదుటి వ్యక్తి ముందు? రిలేషన్షిప్ లో మన పవర్ తగ్గిపోదూ?
అయినా ఈ తప్పు తన తప్పు కి నా జవాబు .. కాబట్టి సరి కి సరి.
అసలు అయినా ఆ వ్యక్తి నేను చేసిన దానికి అలా రెస్పాండ్ అయితే ... తప్పు నాది కాదు వాళ్ళది ...
ఇలాంటివి భార్యాభర్తల మధ్య/స్నేహితుల మధ్య/ఆఫీసు లో పని చేసే వాళ్ళ మధ్య/చుట్టాల్లో/పాలిటిక్స్ లో/బిజినెస్ లో /ప్రొఫెషన్ లో /ఏదో ఒక బంధం ఉన్నవారి తో మామూలే ... ఇంతోటి దానికి సారీ చెప్పక్కర్లేదు
పిల్లలకి సారీ చెప్పడం ఏమిటి? వాళ్లకేం తెలుసు?
నేను సారీ చెప్పడానికి అసలు నాకు సారీ చెప్పారా ఎప్పుడైనా ఎవరైనా?
ఇతి ఈగో ఉవాచ.
ఇంక రెండో వైపు .. తప్పు చేశామనే అపరాధ భావన న్యూనత వైపు నెట్టేసి (ముఖ్యంగా ఇది మొదటి తప్పు కాకపోతే మరీనూ) ... సారీ చెప్పినా ఏమి లాభం లే ... నా మీద నమ్మకం పోయాక అనిపిస్తుంది.
ఒక్కో సారి ఎవరికి 'సారీ' చెప్పాలో వాళ్ళు విలనీయులై... మన 'సారీ' ని ఇష్టం వచ్చినట్టు వాడేసుకొని మన ఆత్మ గౌరవాన్ని కాలి కింద వేసి తొక్కేసే వాళ్ళైతే!
ఇంకా చాలా కారణాలు ఉండవచ్చు 'సారీ' చెప్పక/చెప్పలేక పోవడానికి. (మన తప్పు తెలిసేసరికి వాళ్ళు మన జీవితంలో .. ఈ ప్రపంచం లో ఉండకపోవచ్చు కూడా.)
ఇన్ని అడ్డంకుల మధ్య రెండక్షరాలు బయటికి రాకుండా ఎక్కడో తప్పిపోతాయి.
'సారీ' చెప్పడం తప్పించుకోడానికి ఐస్ క్రీమ్ నుంచి ఏరో ప్లేన్ దాకా ఏది కొనిపెట్టినా శ్రీ కృష్ణ తులాభారం లో లాగా ఆ రెండక్షరాలకి సరి తూగవు.
మనకి ఎవరైనా 'సారీ' చెప్పే పరిస్థితి వచ్చి వాళ్ళు ఎన్నేళ్ళైనా చెప్పకపోతే ఏమనిపిస్తుంది ... ఈ బాధ వర్ణనాతీతం.
అర్ధం లేని 'సారీ' స్వీకరించాల్సి రావడం ఇంకో బాధ.
మరి అర్ధవంతమైన 'సారీ' అంటే ఏది?
ఆరోగ్యకరమైన 'సారీ' ఎలా ఉంటుంది?
సైకాలజిస్టులు వీటి మీద ఆర్టికల్స్ రాసారు. అన్నిట్లో అందరూ ఒప్పుకొనే కామన్ పాయింట్స్ ఇవి.
1. ప్రశాంతమైన మనసు నుంచి వచ్చినదే సరైన 'సారీ' కి పునాది
గొడవ జరిగిన కోపం లో, ఆవేశం లో, ఇదేదో చెప్తే అయిపోతుందని మొక్కుబడిగా అసలు ఎదుటి వ్యక్తి కి ఏం కోపం తెప్పించిందో కూడా తెలుసుకోకుండా 'సారీ' చెప్తే ఏంటో వారి మనసు కి తాకదు. అక్కడి నుంచి మళ్ళీ 'నేను సారీ చెప్పినా నీకు సరిపోదు' లాంటివి మొదలవుతాయి. అందుకే ముందు జరిగిన సంఘటన తాలూకు అలలు శాంతపడి .. పిక్చర్ క్లియర్ అయ్యేదాకా ఆగడం మంచిది. ఇన్స్టంట్ కాఫీ కంటే డికాషన్ కాఫీ బాగున్నట్టు ... ఇన్స్టంట్ సారీ కంటే బాగా ఆలోచించిన చిక్కటి 'సారీ' రుచిస్తుంది ఎదుటి వారికి.
(మరీ ఎక్కువ టైం తీసుకుని కాఫీ చల్లారిపోయి .. తొరక ఏర్పడితే బాగోదు కూడా)
2. తప్పు ఏంటో క్లియర్ గా చెప్పడం, ఒప్పుకోవడం ... పూర్తి బాధ్యత తీసుకోవడం
'నేనేం తప్పు చేసానో నాకైతే అర్ధం కాలేదు ... అయినా నీ సంతోషం కోసం .. 'సారీ'... ఇలాంటివి పనికి రావు. (ఎనభై - తొంభై శాతం మన తప్పు మన ఆత్మసాక్షి కి తెలిసే ఉంటుంది)
'నేను చేసింది నీకు బాధ కలిగించి ఉంటే..' ... 'నేనలా అనలేదు .. నువ్వే అలా అర్ధం చేసుకున్నావు .. ' ... 'అయినా ఇంత సెన్సిటివ్ అయితే ఎలా ...' ..... 'నువ్వు అది ఒప్పుకుంటే నేను ఇది ఒప్పుకుంటా' .... లాంటివి కూడా పనికి రావు ...
నేను <చేసిన తప్పు> చేశాను. దాని వల్ల <జరిగిన పరిణామాలు> జరిగాయి. దీనికి నేను పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను.... అనే మాటలు వినిపించాలి.
'సారీ' అని క్లియర్ గా చెప్పాలట కూడా ...
ఇది చాలా కష్టమైన పని.
అయితే ఈ ప్రకృతి ఏ కష్టం ఉంచుకోదటలెండి ... ఎంత కష్టమైన పని చేస్తే అంతకు అంతా మంచి చేస్తుందట ..
ఇలాంటి నమ్మకాలు లేకపోయినా ఇంకో అసలైన లాభం ఉంది. ఇంత ఓపెన్ గా, షరతులు లేకుండా తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి లేదా ఈ సంఘటన చూసిన ఎవరికైనా మీ మీద గౌరవం పెరుగుతుంది. అసలు ఇంత కష్టమైన పని చేసాక మన మీద మనకే గౌరవం పెరుగుతుంది!
3. టైం ఇవ్వాలి
'సారీ' చెప్పేసాను కదా ... ఇంక నవ్వాలి మరి... అని మీద పడి కితకితలు పెట్టేసి బలవంతంగా నవ్వించేయకూడదు మరి సినిమాల్లో లాగా.
ఆ తప్పు యొక్క తాకిడి అనుభవిస్తున్న వారికి 'సారీ' ఒక మానసిక ఉపశమనం. చాలా అవసరం. అయినా వారు ఈ క్షమాపణ స్వీకరించే స్థితి లో ఉండకపోవచ్చు ... వారికి టైం, స్పేస్ ఇవ్వడం ముఖ్యం.
మీ పని మీరు చేసారని తెలుసుకొని సైలెంట్ అయిపోవడమే తక్షణ కర్తవ్యమ్.
4. మార్పే అసలైన క్షమాపణ
ఇంత అందంగా 'సారీ' చెప్పేసి మళ్ళీ అదే తప్పు చేసి మళ్ళీ అంతే అందంగా 'సారీ' చెప్తే దాన్ని మోసం అంటారు. (నా అనుభవం లో ఈజీ గా 'సారీ' చెప్పేసే వారు ఈ విషయం పూర్తి గా మర్చిపోతారు. 'సారీ' చెప్పేస్తే చాలు అనుకుంటారు...)
ఏ ప్రవర్తన ఇంత హాని కలిగించిందో ఆ ప్రవర్తన లో మార్పే క్షమాపణ కి అసలైన అర్ధాన్ని చేకూరుస్తుంది.
5. స్వీయ క్షమాపణ (ఈ మాట ఉందో లేదో తెలియదు ... సెల్ఫ్ ఫర్గివ్ నెస్ అనే అర్ధం లో వాడుతున్నా నేను)
తప్పు చేసిన వారు వారిని వారు క్షమించుకోవడం చాలా ముఖ్యం. ఓ తప్పు చేసాం. అది ఇప్పుడు మనం వెనక్కి తీసుకోలేనిది.
హిందీ హీరో ధర్మేంద్ర రాసిన ఓ కవిత లో
'गलतियों का पुतला, आखिर इक इंसान हूं मैं। Galtiyon ka putla, aakhir insaan hoon main' ...
తప్పులు చేసే బొమ్మ ని ... మనిషి ని కదా నేను! అంటాడు.
ఒక్కో సారి ఈ సైకాలజిస్టులు మరీ చాదస్తం గా చెప్తారు అన్నీ అనిపిస్తుంది.
మనం తప్పులు చేసే స్పీడ్ కి ఇలా ఐదు స్టెప్పుల ప్రాసెస్లు చేస్కుంటూ పోతే ఉద్యోగం, సద్యోగం, ఇంటి పని, పిల్లల పని .. వీటన్నిటికీ టైం ఎక్కడుంటుంది చెప్పండి? మానసిక ఆరోగ్యం... బంధాల్లో ఆరోగ్యం అంటూ కూర్చుంటే తొంభై తొమ్మిది శాతం పనులు చెయ్యలేం... ఎలాగూ అందరం రాటుదేలిపోయాం ... ఎవరో 'సారీ' చెప్పలేదు అని ఎవరూ జీవితాలు ఆపేసుకొని కూచోవట్లేదు .. ఇవన్నీ ఎవరూ expect కూడా చెయ్యట్లేదు. ఎందుకు కొత్తవి అలవాటు చెయ్యాలి?
మరెందుకు ఇదంతా రాసావు అంటే .... అయామ్ సారీ.

'సారీ చెప్పేద్దాం' ,, క్షణక్షణం లో ఈ సీన్ గుర్తుందా 😁 |

पुतला అంటే బొమ్మ అనేకంటే డమ్మీ అంటే బాగుంటుందేమో ?
ReplyDelete
ReplyDeleteఅలాగే నండీ సారీ :)
సౌమ్యవాదం లో మంచి అంశంపై
ReplyDeleteమంచిచర్చచేశారీ సారి
Accepted your apologies for this long absence. Please write regularly without break. :-)
ReplyDeleteMee blog chala bagundi. Chakkati bhasha. Simplega , sootiga undi. You are able to write as you think and that shows. Congratulations on the fine job. Keep it up. Please keep writing !
ReplyDeleteచాలా బాగా వ్రాశారు. Looks simple but not so easy to say a genuine sorry. Also the one who receives it should take it in the right spirit
ReplyDelete1) ఎదుటి వారిలోని మంచిని మనస్ఫూర్తిగా మెచ్చుకోవడం
2) స్వంత అభిప్రాయాలు తప్పు అయినప్పుడు మార్చుకోవడం
3) ఆత్మీయులు అనుకునే వారికి సలహాలు ఇవ్వడం, స్వీకరించడం
4) పొరపాటు అంగీకరించి సారీ చెప్పడం
ఇవి ఆచరణీయం అని నా అభిప్రాయం.
Interesting and useful.
ReplyDelete