Posts

Showing posts from August 31, 2025

జ్ఞానమొసగరాదా - (నేను రాసిన కథ)

Image
  జ్ఞానమొసగరాదా శారద పాడనంటోందిట. గురువైన వసంత కి చెప్పి ఒకటే ఆందోళన పడిపోతున్నారు ఆమె తల్లిదండ్రులైన అరుణ, మురళి.  పదకొండేళ్ళుంటాయి శారద కి. అప్పటికే ఆరేళ్ళ నుంచి సంగీతం నేర్చుకుంటోంది వసంత దగ్గర.   సంగీతం మీద పట్టున్న ప్రతీ ఒక్కరూ మంచి గురువు కాలేరు. దానికి కావాల్సిన నైపుణ్యాలు వేరే ఉంటాయి. ప్రతి పిల్ల/పిల్లాడు ఏదో ఒక సైకాలజీ లో ఉంటారు. వారిని అర్ధం చేస్కుంటూ ఓర్పుగా చెప్పుకురావాలి ఈ కళ ని. వసంత ఇందులో సిద్ధహస్తురాలు. ఆ విషయం ఆనందంగా వసంత క్లాసులకి వచ్చే పిల్లలని చూస్తే తెలిసిపోతుంది. వారు వేదిక మీద పాడటం మొదలు పెట్టాక మిగిలిన సంశయాలు కూడా తీరిపోతాయి ఎవరికైనా.  ఇలాంటి ప్రోగ్రాం ఒకటి చూసారు పెళ్ళైన కొత్తల్లో అరుణ, మురళి. అంతే, నిర్ణయం తీసేసుకున్నారు. తమకి పుట్టబోయే సంతానాన్ని ఆమె దగ్గరే సంగీతానికి పెట్టేయాలని. వారి సంకల్ప బలమో ఏమో శారద కూడా కంచు కంఠం తోనూ సంగీతం పట్ల ఆసక్తి తోనూ పుట్టేసింది. చిన్నప్పటి నుంచి ఏదైనా పాట వింటే పాడగలిగేది. ఇంకేం! అరుణ, మురళుల ఆనందానికి హద్దే లేదు!  తల్లిదండ్రుల చెయ్యి పట్టుకుని మొదటి సారి వసంత దగ్గరకి వచ్చింది ఐదేళ్ళ శారద. పెద్ద పె...