Posts

Showing posts from 2024

జో బాత్ తుజ్ మే హై .....

Image
 చాలా రోజుల నుంచి ఓ విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నా.... ఇలా సందర్భం కుదిరింది....  ఒకప్పుడు కేవలం మెమరీ కోసం పనికొచ్చే ఫోటోలు ఇప్పుడు వాటి పరిధులు దాటి కొంచెం మితిమీరి మనశ్శాంతి పోగొడుతున్నాయి కదా ....  కొంత మందికి ఫోటో చూసాక స్ట్రెస్ మొదలవుతుంది.. యాంగిల్, బట్టలు, లైటింగ్... ఇవి మనం రూపాన్ని కెమెరా కి వేరేలా చూపిస్తాయి అని తెలీక ఆ కనిపించేదే నిజమనుకుని చాలా బాధపడుతున్నారు పాపం కొంతమంది. (మగవారు కూడా ఇలా ఫీలవుతున్నారా? ఎక్కువగా ఆడవారేనా? దీనికి జెండర్ తో సంబంధం లేదా? )  మీడియా లో పని చేసిన టెక్నీషియన్ గా ఒక ప్రొఫెషనల్ ఫోటో వెనక ఎంత శ్రమ, ఎన్ని జాగ్రత్తలు, ఎన్ని జిమ్మిక్కులు ఉంటాయో తెలుసు నాకు. అలాంటిది నేను కూడా ఒకో సారి నా ఫోటో చూసి స్ట్రెస్ అయిన రోజులున్నాయి. అలాంటప్పుడు ఎవరు ఎంత చెప్పినా నమ్మబుద్ధి కాదు .. మనం బానే ఉంటామని.  కొంచెం పెద్దయ్యాక జీవితం బోల్డు కష్టాలు చూపించి ఈ కష్టాన్ని చిన్న గీత చేసినందువల్ల ఇలా ఉన్నా దేవుడి దయ వల్ల 😊  ఈ పాట విషయానికొస్తే నాకు చాలా ఇష్టమైన పాట .. తాజ్ర మహల్ (1963) చిత్రం లోనిది. రఫీ గారి గొంతు, రోషన్ గారి సంగీతం, సాహిర్ లుధియాన్వీ పలుకులు ....