తల్లి ఆరాటం

నేను కిందటి వారం లిటిల్ విమెన్ నవల గురించి రాసాను కదా .. ఆ నవల ఐప్యాడ్ లో  ఆపిల్ బుక్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకొని చదివాను. 

ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే ఈ పఠనానుభవం బహు సౌలభ్యంగానున్నది. 

నేను చదివిన నవల మన మాతృ భాష కాదు ...పైగా 152 ఏళ్ళ క్రితం రాసినది. నాకు అంతగా పరిచయం లేని కొన్ని పదాలు, వాడుకలు, అలవాట్లు, నవల్లో పాత్రలు ప్రస్తావించిన నాటకాలు, పుస్తకాలు... ఇవి ఎదురైనప్పుడల్లా ...  వెంటనే గూగుల్ చేసుకొనే అవకాశం కల్పించింది ఐ ప్యాడ్. 

ఉదాహరణ కి 



అసలు SARTOR RESARTUS అనే మాట నేను ఎప్పుడూ వినలేదు .. అది ఇంగ్లీష్ అని ఎవరైనా చెప్తే నేను నమ్మేదాన్ని కూడా కాదు. మరి ఇక్కడ ఆ పదానికి అర్ధం తెలియకుండా భావం తెలియడం కష్టమే. అప్పుడు ఆ పదాన్ని సెలెక్ట్ చేసుకొని 'లుక్ అప్' అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. 

అప్పుడు తెలిసిన విషయం ఇది. . 


థామస్ కార్లైల్ అనే ఆయన బట్టల ప్రాముఖ్యత మీద రాసిన ఓ కామెడీ పుస్తకం అది అని. ఇప్పుడు భావం కూడా అర్ధం అయింది. 

అలాగే పుస్తకం లో నాకు నచ్చిన అంశాలు హైలైట్ చేసుకొనే వీలు కల్పించింది. మామూలు పుస్తకాల్లాగే బుక్మార్క్ చేస్కోవచ్చు. మనం రీడింగ్ గోల్ రోజు కి ఇన్ని నిముషాలు అని పెట్టుకుంటే మనం చదువుతుండగా అన్ని నిముషాలు అవ్వగానే 'కంగ్రాట్యులేషన్స్ ... ఈ రోజు గోల్ పూర్తి చేసారు!" అని మెసేజ్ వస్తుంది స్క్రీన్ మీద. ఇది భలే ఎంకరేజింగ్ గా ఉంటుంది!

ఇదంతా నా దగ్గర ఐప్యాడ్ ఉందని చెప్పుకోడానికి రాసినది కాదు. నా అసలు ఉద్దేశం ఇది. 

ప్రతిభ గల పిల్ల ఉన్న తల్లి  ... అదే ఈడు గల ఇంకో పిల్ల ఏం చేసినా ... 'మా అమ్మాయి కూడా చేస్తుందండి .. మా అమ్మాయి పేరు కూడా రాసుకోండి" అని ముందుకి తోసి ఆరాటపడిపోతుంది చూడండి ... అలాగే నాకు తెలుగు పుస్తకాల కి కూడా ఇలాంటి వైభవం రావాలని ఉంది. 

మన భాష లో రచనలు ప్రపంచ సాహిత్యం లో దేనికి తక్కువ? 

ఛందోబద్ధ పద్యాలు, వచన కవిత్వం, చిన్న కథ, నవల, వ్యాసాలు, సమీక్షలు, కళలకి సంబంధించిన శాస్త్ర గ్రంథాలు, బాల సాహిత్యం, బాలశిక్షలు, నిఘంటువులు, ఏ కోవ కీ చెందని ప్రయోగాత్మక రచనలు ... ఎన్ని లేవు? 

రాశిపోసిన ఇంతటి జ్ఞానానికి విజ్ఞానం తోడైతే ఎంత బాగుంటుంది? 

పుస్తకం పట్టుకోవడం లో ఆనందమే వేరు అనుకొనే వారు అలాగే చదువుకోవచ్చు. కానీ గాడ్జెట్స్ మీద గంటలు గంటలు టైం గడుపుతున్న వారికి యధాలాపంగా అయినా ఇవి కనిపిస్తే ఓ కొత్త తరం చదువరులను సృష్టించుకున్నట్టు అవుతుంది కదా? 

చదివే వారు ఎప్పుడూ ఉంటారండి. వారికి కొన్ని సులభతరం చెయ్యాలి. 

పన్నెండు నెలలు పన్నెండు పుస్తకాల పథకం లో ఫిబ్రవరి లో  నేను చదివిన తెలుగు నవల జలంధర గారి 'పున్నాగ పూలు'. (దీని గురించిన నా ఏక వాక్య సమీక్ష - తప్పకుండా చదవండి, అంతే.) 

ఈ పుస్తకం ఆన్లైన్ లో తెప్పించుకున్నాం. తెలుగు పుస్తకానికి ఓ ఈ కామర్స్ వెబ్సైట్ ఏర్పాటై ఇలా ఇంటి కి చిన్న క్లిక్ తో తెప్పించుకోగలము అని కొన్నేళ్ల క్రితం ఊహించగలిగామా? 

స్కూల్ లో చాలా మంది ఆబ్సెంట్ అయిన రోజు, టీచర్ 'ఇంత మంది ఆబ్సెంట్ అయితే ఎలా ... మీకసలు లక్ష్యం లేకుండా పోతోంది' అని తిడుతూ ఉంటారు. ఈ లాజిక్ నాకర్ధం కాదు. ప్రెజెంట్ అయిన వాళ్ళకి ఈ తిట్లు అనవసరం కదా. ఓ రోజు ఆగి ఆబ్సన్ట్ అయిన వాళ్ళు తిరిగి వచ్చాక వాళ్ళని తిట్టచ్చు కదా. 

అలాగే ఇప్పటికే తమ వంతు కృషి చేస్తూ, తెలుగు పుస్తకాన్ని విజ్ఞానం తో జోడించి ముందుకి తీసుకువెళ్తున్న వారు ఎంతో  మంది ఉన్నారు. ఈ-బుక్స్, ఇందాక చెప్పినట్టు పుస్తకాలకి ఆన్లైన్ స్టోర్స్, ఆడియో పుస్తకాలు ఆప్ ద్వారా అందించడం ... ఇవి జరుగుతున్నాయి. అలాగే తెలుగు వికీ ని మరింత సుసంపన్నం చేస్తున్న ఎంతో మంది స్వచ్ఛంద కార్యకర్తలు ఉన్నారు.  అసలు నేను ఒక బ్లాగు ని తెలుగు అక్షరాల్లో రాయగలుగుతున్నాను. ఈ బ్లాగు ఫోన్ల తో సహా అన్నిట్లో ఓపెన్ అవటం ఎంత అద్భుతం! దీనికి ఎంత మంది కారణమయ్యారు! ఇటువంటి వారందరికీ నా వందనాలు. More power to you, ladies and gentleman. 

కానీ నేను వారి గురించి మాట్లాడట్లేదు. 

మనకున్నంత మంది కంప్యూటర్ నిపుణులు ఇంకెక్కడా లేరు కదా.... ఆ నెంబర్ కి, మన భాష పురోభివృద్ధి జరుగుతున్న వేగానికి సంబంధం ఎందుకు లేకుండా పోతోంది అనేది నా ప్రశ్న.

ఈ రోజు వరకూ కిండిల్ లో తెలుగు లేదు. మరి భారతీయ భాషలే లేవా అంటే ఎందుకు లేవు (ఐదు భాషలు ఉన్నాయి ...  హిందీ,  మలయాళం, గుజరాతీ, తమిళ్, మరాఠీ. బెంగాలీ లేకపోవడం నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది సుమండీ) 

ఆపిల్ బుక్ స్టోర్ లో కూడా అంతే. 

సామెత చెప్పినట్టు ఈ-పుస్తకాలే లేవు. ఇంక నేను ముందు ప్రస్తావించిన ఫెసిలిటీస్ ఎక్కడుంటాయి చెప్పండి? 

ఎంత మాతృ భాష అయినా, దానికీ మనకీ కొంత గాప్ వచ్చేసింది. మాండలికాలు, కొన్ని పదాలు అర్ధమవ్వక పోవడం సహజం. మొన్న కొంత మంది పదేళ్ల లోపు పిల్లలకి 'బడి శలవు',  'షికార్లు' అనే పదాలు తెలియలేదు.

నేను చదివిన తెలుగు పుస్తకాల్లో  నాకూ కొన్ని పదాలకి అర్ధాలు తెలియలేదు. 

ముళ్ళపూడి వారు వాడే 'రికామీ'  'అవటా' 
గొల్లపూడి గారి కథా సంకలనం (దీని గురించి ప్రత్యేకంగా ఓ పోస్ట్ రాస్తాను) లో కొలకలూరి ఇనాక్ వారి  'పిండీకృత శాటీ' అనే కథ అసలు టైటిల్ ఏ అర్ధం కాలేదు ... కథ చాలా బాగుంది.

అలాగే అదే పుస్తకం లో కాళీపట్నం రామారావు గారు రాసిన 'యజ్ఞం' లో 'మ్లాణ' అనే పదం ... (ఈ కథ కూడా అద్భుతం అండి)

మొదటి సారి కన్యాశుల్కం చదివినప్పుడు 'యాంటీ నాచ్చి' అనే పదాలు .. (నిజానికి ఇది  ఇంగ్లీషే .. కానీ తెలుగు లో రాసేసరికి స్పెల్లింగ్ ఏమయ్యుంటుందో గ్రహించడం కష్టం అయింది. అలాగే నేను పుట్టే అప్పటికే ఈ సామజిక సమస్య లేదు కదా  .. అందుకే పేపర్లలో కూడా చదివే అవకాశం లేదు) 

వీటన్నికీ చచ్చి చెడి ఎలాగోలాగా అర్ధాలు తెలుసుకున్నాలెండి తర్వాత. కొన్ని కాంటెక్స్ట్ లో అర్ధం చేసుకోవాల్సి వచ్చింది. కొన్నిటి కోసం చరిత్ర తెలుసుకోవాల్సి వచ్చింది. (రికామీ, అవటా ల కి అర్ధం స్వయంగా బాపూరమణల శిష్యులైన  బ్నిమ్ గారిని అడిగి తెలుసుకోగలగడం ఒక ప్రివిలేజ్ గా భావిస్తాను)

ఈ రోజుకీ ... ఈ పదాలు సరదాగా గూగుల్ చేస్తే ... ఒక్కదానికీ సరైన సమాధానం దొరకదు సరికదా బాగా నవ్వుకోవచ్చు.

అసలు రచయిత పేరు కానీ కథ కానీ రాలేదు చూసారా ...
అసలు 'శాటీ' ఏ లేదంటూంటేనూ

నిముషానికి కొన్ని మిలియన్ల పేజీలు జోడింపబడే గూగుల్ లో
ఒకే రిజల్ట్ వచ్చిన పదం ... అవటా 


ఇది కూడా అంతే..

పోనీ ఇవన్నీ కష్టమైన పదాలు.. ఇది చూడండి 



ఇంగ్లీష్ అంటే అంతర్జాతీయ భాష .. దానితో మనకి పోలికా అని మీరు నన్ను నిలదీయచ్చు. 

మన జాతి అతి పెద్ద ఎగుమతి కంప్యూటర్ నిపుణులు. వంటొచ్చిన వాళ్ళుండీ, వంట సామాగ్రి ఉండీ పోషణ కరువయిపోతున్న భాష మనది. 

(ఎప్పుడైనా ఆనందం ఎక్కువై ఏం చేసుకోవాలో తెలియనప్పుడు 'తెలుగు' అని కానీ 'telugu' అని కానీ గూగుల్ చేయండి. మొదటి పేజీ లో కనిపించే ఇమేజ్, వీడియో, లింకుల జాబితా లో మన జాతి విలువల ప్రోగ్రెస్ రిపోర్ట్ మీకు తెలిసిపోతుంది. ఆ తర్వాత మీ తత్వాన్ని బట్టి ఆగ్రహమో, దుఃఖమో, నిర్వేదమో కలిగి బ్యాలెన్స్ అయిపోతారన్నమాట. )  

SEO అని ఒకటి ఉంది .... సెర్జ్ ఇంజిన్ ఆప్టిమైజషన్ ... దీనికోసం ప్రత్యేకంగా నిపుణులు ఉంటారు . ఇందులో కూడా తెలుగు వారు ముందున్నారండోయ్. వాళ్ళ పనల్లా మనం డబ్బులిస్తే మన వెబ్సైట్ మొదటి పది గూగుల్ రిజల్ట్స్ లో వచ్చేలా చెయ్యడమే. మన వెబ్సైట్ పదాలు అటూ ఇటూ చేసినా మన పేరే వచ్చేలా కూడా చెయ్యగలరు వీళ్ళు! అంటే స్పెల్లింగ్ మిస్టేక్ అయినా ఫర్వాలేదన్నమాట. 

పాపం తెలుగు తల్లి కే వాళ్ళకి ఇవ్వడానికి డబ్బుల్లేవు. అందుకే రచయితల పేరు, వారు రాసిన నిధి లాంటి సాహిత్యం, అమృత తుల్యమైన తెలుగు పదాలు ... వీటికి సంబంధించిన వెబ్ పేజీలు ఉండవు .. ఉన్నా కనబడవు. 

నేను కూడా ఆశ చావని ఆప్టిమిస్టుని కాబట్టి... ఏదో ఒక రోజు ... కిండిల్ లో నో , ఆపిల్ బుక్ స్టోర్ లోనో ఎవరో ఒక తెలుగు వ్యక్తి కన్యాశుల్కం కొనుక్కొని చదవడం ప్రారంభించి నాటకం లో రెండో పదం ఐన 'పూటకూళ్ళమ్మ' అనే పదం అర్ధం కాక అది సెలెక్ట్ చేసుకొని 'లుకప్' అనే ఆప్షన్ choose చేసుకుంటే ఒక నాలుగు రకాల నిఘంటువు అర్ధాలు, సరైన వాడుక, పూటకూళ్ళమ్మలు ... వారి చరిత్ర మీద వికీ పేజీ...  వింటేజ్ ఫొటోగ్రాఫులు/చిత్రాలు, దీని మీద చర్చ జరుపుతున్న సాహిత్య ఫోరాలు .. ఒకప్పుడు దీనికి అర్ధం గూగుల్ లో లేదు అని రాసిన నా బ్లాగ్ .. ఇవి రిజల్ట్స్ గా కనపడతాయని ఆశిస్తున్నాను.

ఈ రోజు ఇలా సెర్చ్ చేస్తే ఏం వస్తుందో చూడాలనుంటే సరదాగా 'పూటకూళ్ళమ్మ meaning' అని గూగుల్ చేయండి 😊 

Comments

  1. చాలా చాలా బాగుంది గాడ్ బ్లెస్స్ యు

    ReplyDelete
  2. సౌమ్య గారు,
    నమస్తే
    మా పల్లెలలో సారా షాపులుంటాయిగాని పుస్తకాల షాపులుండవండి. పుస్తకాలు కొందామంటే దొరకవు, కొందామన్నా స్తోమతా ఉండదు. పొరబాటున కొన్న పుస్తకాలు దాచుకోడానికి చోటూ ఉండదు.

    మీరు నెట్ లో చదివినా పుస్తకం చదివినా పరభాషా పుస్తకాలని పరిచయం చెయ్యండి. మేమెలానూ పరభాషా పుస్తకాలు చదవలేము. మీరు రాసే పరిచయంతో కొంత ఆ పుస్తకాల గురించి తెలుసుకోగలుగుతాం.
    ధన్యవాదాలు.

    ReplyDelete
  3. meeru Quora Telugu ki thapakunda raavaali. mee knowledge akkada kuda share cheyandi please.
    let us make Quora Telugu community bigger.

    ReplyDelete
  4. మీకు తెలియదని కాదు గానీ ..... anti-nautch అనే మాట మీరన్న పూర్తి ఇంగ్లీష్ మాట కాదు. anti ఇంగ్లీషే. nautch (నాచ్) అంటే dancing girl అని అర్ధం ... హిందీ / ఉర్దు భాషా పదం. నాచ్నా అంటే డాన్స్ చెయ్యడం అనే అర్ధమే కదా, దాంట్లో నుండి తీసుకుని anti కు తగిలించిన పదం. anti-nautch సగం ఇంగ్లీష్, సగం హిందీ/ఉర్దు. ఆ కాలపు సమాజంలో dancing girls ఒక భాగం. తరువాత తరువాత anti-nautch movement వల్ల ఆ వృత్తి వేరే రకంగా దిగజారడంతో ఆ మాటను హేళనాభరితమైన అర్ధంలో వాడడం మొదలయింది ("కన్యాశుల్కం" నాటికే).

    Nautch (నాచ్)

    ఆబ్సెంట్ అయిన వాళ్ళ గురించి ప్రెజెంట్ అయిన వాళ్ళను తిట్టడం ...బహుశః వాళ్ళు ఆబ్సెంట్ అయిన తమ స్నేహితులతో మాస్టారు మిమ్మల్ని ఇలా తిట్టారురా అని convey చెయ్యడం కోసమేమో? క్లాస్ కు ఎప్పుడు వస్తే అప్పుడు ఎలాగూ మాస్టారి చేతిలో తప్పవ్ అనుకోండి 😃.

    కిందనుండి రెండో పేరాలోని మీ ఆశావాదం బాగుంది. Let us hope so.

    మొత్తం మీద మీ పోస్ట్ ఆసక్తికరంగా ఉందండి.

    ReplyDelete
    Replies
    1. ఏంటీనాచ్ అంటే ఏమిటో అనుకున్నా. అర్థం తెలిపినందుకు ధన్యవాదాలు!

      Delete
    2. VNR gaaru and Sarma gaaru, you are one of the most compelling reasons to come to telugu blogs for me (for explaining all things important and useful). thank you for your enlightenment and knowledge sharing.

      Saumya gaaru, I don't want to ignore the main topic here. We - telugus - as a race talk more and do less. We wake up only when others make noise about relevant issues. You hit spot on with lack of our literature online. let us hope for the best. thank you..

      Delete
    3. Thank you Anonymous garu for your nice words 🙏. నాకు తెలిసినది అంతంత మాత్రమేనండి.

      మీ పేరు తెలిపితే మీ వ్యాఖ్య మరింత శోభస్కరంగా ఉండేది.

      Delete

Post a Comment