దిల్ మే ఏక్ లెహెర్ సీ ఉఠీ హై అభీ...
సముద్రమంటే ఇష్టమైన వారిలో నేనూ ఒకదాన్ని. మొదటి సారి వైజాగ్ లో ఉండే మావయ్య తీసుకెళ్లాడు... దూరం నుంచి 'అదిగో అదే సముద్రం' అన్నాడు. నాకు ఆకాశం తప్ప యేమ్ కనబడదే!
అప్పుడు మా మావయ్య 'ఆకాశం అని నువ్వు అనుకుంటున్న చోటు ని జాగ్రత్త గా గమనించు...ఓ సన్నటి లైన్ కింద నించి నీలం రంగు కొంచెం ముదురు గా కనిపించట్లేదు? అదే సముద్రం' అన్నాడు ... నేను థ్రిల్ల్ అయిపోయాను ....అప్పుడు ... I fell in love
పిల్లల తో ఎవరైనా అదే పని గా ఆడలేరు .... అలిసిపోతారు .... ఒక్క ప్రకృతే పిల్లలు అలిసిపోయే వరకూ ఎంటెర్టైన్ చెయ్యగలదు అనిపిస్తుంది!
ఆ ఘోష .... ఎడతెరిపి లేని అలలు .... ఇసక... గవ్వలు ... ఆల్చిప్ప లు... వాటిలో ముత్యాలు ఉండచ్చేమో అనే వెర్రి ఆశ ... ఇష్టం లేకుండా ఉండేందుకు యేమీ లేదు సముద్రం లో
నాకు అలల తో కబడ్డీ ఆడటం ఇష్టం.... మొన్న
వచ్చిన ఓ హిందీ సినిమా లో ఈ సీన్ చూసి అందరికీ ఈ ఆట తెలుసన్నమాట అనుకున్నా ☺
ఇంత ఇష్టమైన సముద్రాన్ని ఎక్కువ సార్లు చూసే అవకాశం కలగలేదు నాకు. .. విధి చేసే వింత కాకపొతే భూమి మీద మూడొంతులు నిండిన సముద్రాన్ని చూడటం అంత కష్టమా?
ఆ విధే ఇంకో వింత చేసింది. పోయిన వారం ఏకంగా ఐదు రోజులు సముద్రం పంచనే గడిపే అవకాశం దొరికింది! (వివరాలు త్వరలో)
కొన్ని రాళ్లు, గవ్వ లు, ఙ్ఞాపకాలూ, అనుభూతులూ యేరుకొని దాచుకున్నా ....సముద్రం అంటే స్పందించే ఫ్రెండ్స్ కి ఫొటో లు పంపించా ..కబడ్డీ ఆడలేదు కాని కొన్ని పాటలు పాడి వినిపించా సముద్రానికి.
దిల్ మే ఏక్ లెహెర్ సీ ఉఠీ హై అభీ ...
నన్ను పిచ్చి దాన్ని అనుకున్నా సరే, తీసి పారేసినా సరే, లాజికల్ కాకపొయినా సరే .... నాకున్న నమ్మకం చెప్తాను ...
సముద్రం ప్రతి మనిషికి ప్రత్యేకంగా స్పందిస్తుంది ...
ఓ సారి ....మా వైజాగ్ ట్రిప్ పూర్తయింది... హైదరాబాద్ వచ్చేస్తున్నాం. ... ఐదు నిముషాలైనా గడపాలి అని బీచ్ కి వచ్చా .... టైం అయిపోవడం తో 'వెళ్తున్నా మరి... బై చెప్పవా' అనగానే అలలకి దూరంగా నుంచున్న నన్ను ఓ పెద్ద అల వచ్చి సగం తడిపేసి వెళ్లింది!
It looks like the Sea is an ocean of emotions :)
ReplyDeleteIt is soo many things....sea is as u see, i guess!
Delete